Ritu Chowadary:జబర్దస్త్ కామెడీ షో ద్వారా లేడీ కమెడియన్లుగా గుర్తింపు పొందిన వారిలో రీతు చౌదరి కూడా ఒకరు. మొదట బుల్లితెర నటిగా ప్రేక్షకులకు పరిచయమైన రీతూ చౌదరి ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షో లో తనదైన శైలిలో ప్రేక్షకులను నవ్విస్తూ లేడీ కమెడియన్ గా గుర్తింపు పొందింది. ఇలా బుల్లితెర మీద ప్రసారం అవుతున్న సీరియల్ టీవీ షోలలో సందడి చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ తో నెటిజన్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. అప్పుడప్పుడు అమ్మడు చేసే గ్లామర్ షో కి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. ఇటీవల రీతు చౌదరి తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడు. తండ్రి మరణంతో రీతు తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇప్పటికీ ఆ బాధనుండి బయటపడలేకపోతోంది. అందువల్ల తండ్రి లేడు అన్న బాధనుండి బయటపడటానికి ఆయన జ్ఞాపకాలకు దూరంగా ఉండాలని రీతూ చౌదరి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
తాజాగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ఈ క్రమంలో తాను చిన్నప్పటినుండి తన తండ్రితో కలిసి ఉన్న ఇంటిని వదిలి వేరే ఇంటికి వెళ్లడానికి సిద్ధపడింది.
ఆ ఇంట్లో తన తండ్రితో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని, ఇప్పుడు తండ్రి దూరమవడంతో ఆ జ్ఞాపకాల వల్ల ఆయన లేని లోటుని మర్చిపోలేకపోతున్నట్లు రీతు తెలిపింది.

Ritu Chowadary: గతాన్ని మర్చిపోతేనే ముందుకు వెళ్లగలం…
ఎప్పటికైనా గతాన్ని మరిచిపోతేనే భవిష్యత్తులో ముందుకు వెళ్లగలం. అందువల్ల నాన్న లేడు అన్న నిజాన్ని మరిచిపోయి భవిష్యత్తు కోసం ఆయన జ్ఞాపకాలకు దూరంగా వెళ్లడానికి సిద్ధపడినట్లు రీతు తెలిపింది. ఈ క్రమంలో పిల్లో కవర్ మీద తన తండ్రితో కలిసి ఉన్న ఫోటోలు, తన తండ్రి షర్టు చూసి ఎమోషనల్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా రీతూ చౌదరి అభిమానులు, స్నేహితులు ఆమెని ఓదారుస్తూ కామెంట్లు చేస్తున్నారు.


































