Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి ఇండస్ట్రీలో ఉన్న పేరు ప్రఖ్యాతల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ హీరోగా గుర్తింపు పొందిన చిరంజీవి సినిమాలలో మాత్రమే కాకుండా నిజజీవితంలో కూడా అవసరమైన వారికి సహాయ సహకారాలు చేస్తూ మెగాస్టార్ గా అందరి మనసుల్లో నిలిచిపోయారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు ఇబ్బందుల్లో ఉన్నారని తెలియగానే చిరంజీవి ముందుకు వచ్చి వారికి సహాయం చేస్తూ ఉంటాడు.

ఈ క్రమంలో తాజాగా చిరంజీవి మరొకసారి తన మంచి మనసు చాటుకున్నాడు. ఇలాంటి ఎన్ని గొప్ప పనులు చేసినా కూడా చిరంజీవి తాను చేసిన సహాయం గురించి ఎవరికీ చెప్పకుండా ఉంటాడు. ఇదిలా ఉండగా ఇటీవల విడుదలైన బలగం సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే విషయాలను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించారు. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.
ఇక ఈ సినిమా క్లైమాక్స్ లో ఉన్న ‘తోడుగా మాతో ఉండి నీడగా మాతో నడిచి ‘ అనే పాట సినిమాకి ప్రాణం పోసిందని చెప్పవచ్చు. మొగిలయ్య దంపతులు పాడిన ఈ పాట అందరి హృదయాలకు హత్తుకునేలా ఉంది. అయితే ఒక్క పాటతో మంచి గుర్తింపు పొందింన మొగిలయ్య దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు.మొగిలయ్య అనారోగ్య సమస్యల గురించి తెలుసుకున్న చిరంజీవి డైరెక్టర్ వేణు కి ఫోన్ చేసి మొగిలయ్య ఆరోగ్యం గురించి వివరాలు ఆరా తీసి వారికి సహాయం చేయటానికి ముందుకు వచ్చారు.

Chiranjeevi: ఖర్చు మొత్తం భరిస్తానన్న చిరు..’
మొగిలయ్య దంపతులు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. మొగిలయ్యకు దీర్ఘాకాలిక మధుమేహం ఉండడంతో కంటిచూపు మందగించింది. దీంతో అతనికి కంటి చూపు తిరిగి వచ్చేలా చికిత్స కోసం ఎంత ఖర్చైనా సరే తానే భరిస్తానని చిరంజీవి భరోసా ఇచ్చినట్లు వారు వెల్లడించారు. దీంతో మొగిలయ్య దంపతులతో పాటు అభిమానులు కూడా చిరంజీవి చేస్తున్న మంచి పనికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
Annayya #Chiranjeevi Personal call to @VenuYeldandi9 about Balagam Mogilaiah Eyes surgery@KChiruTweets said He will help financially for Mogailaiah Surgery#MegastarChiranjeevi pic.twitter.com/t2mwHTuyf1
— Chiranjeevi Army (@chiranjeeviarmy) April 17, 2023

































