Balagam Fame Lalitha : తెలంగాణ పల్లె వాతావరణం, సంస్కృతిని సహజంగా చూపించి సక్సెస్ అయ్యాడు దర్శకుడు వేణు. ఒక మనిషి చనిపోయినపుడు ఇంట్లోని కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుంది ఎలా ఫీల్ అవుతారు లాంటి విషయాలను చాలా సునిశితంగా చూపించారు. బలగం సినిమా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని కాకుండా దేశ విదేశాలలో చాలా మందికి నచ్చుతోంది. ఇక తెలంగాణ పల్లెల్లో అయితే గ్రామంలో అందరూ కలిసి సినిమా చూస్తూ ఎమోషనల్ అవుతున్నారు. అంతలా సినిమా అందరికి కనెక్ట్ అయి ఆర్టిస్టులకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఎన్నో ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీ లో ఉన్న కూడా అంతగా రాని గుర్తింపు ఈ ఒక్క సినిమతో చాలా మంది ఆర్టిస్టులకు గుర్తింపు వచ్చింది. అలా సినిమాలో హీరో పిన్నిగా గయ్యాళి పాత్రలో నటించిన లలిత చిరంజీవి గారు ఆమె వ్యక్తిగత జీవితం అలానే తన కెరీర్ గురించి మాట్లాడారు.
సినిమాకి రెమ్యూనరేషన్… పవన్ సినిమాలో నటించబోతున్న…
సురభి కళాకారిణి గా థియేటర్ ప్రోగ్రామ్స్ ఎన్నో చేసిన లలిత చిరంజీవి గారు ఆమె సినిమా ప్రస్థానం గురించి మాట్లాడుతూ బలగం కంటే ముందు కొన్ని సినిమాలలో చేసానంటూ చెప్పారు. అలాగే ఎన్నో ఆడిషన్స్ ఇచ్చిన అవకాశాలు మాత్రం రాలేదని వివరించారు. అలాంటిది బలగం సినిమాకు దిల్ రాజు గారి బ్యానర్ లో అవకాశం రావడం వల్ల రెమ్యూనరేషన్ గురించి పెద్దగా ఆలోచించలేదని బాగానే ఇచ్చిన దాని కంటే కూడా మంచి బ్యానర్లో మంచి పాత్ర లభించిందనే అంశం ఆనందాన్ని ఇచ్చిందంటూ తెలిపారు.
ఇక సినిమా రంగంలో ఉండే క్యాస్టింగ్ కౌచ్ గురించి పలు ఇంటర్వ్యూ లో అడగడం వల్ల చెప్పాల్సి వచ్చిందని తనకు అలాంటి పరిస్థితులు ఎక్కడ ఎదురుపడలేదని తెలిపారు. సినిమా చేస్తున్నప్పుడు కంటే సినిమా షూటింగ్ పూర్తయ్యాక క్లైమేక్స్ లో వచ్చే పాట విన్నప్పుడు మా అమ్మమ్మ గుర్తొచ్చి బాగా ఏడ్చాను అంటూ తెలిపారు లలిత. ప్రస్తుతం బలగం చిన్న కోడలిగా బాగా గుర్తింపు వచ్చిందని తాజాగా పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు ఆడిషన్ ఇచ్చాను సెలక్ట్ అవుతానో లేదో తెలియదు అంటూ చెప్పారు లలిత.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…