Sarayu: బిగ్ బాస్ ఫేమ్ సరయు అరెస్ట్.. బంజారహిల్స్ స్టేషన్ కి తరలింపు!
Sarayu: బోల్డ్ కామెంట్స్ ద్వారా నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే సెవెన్ ఆర్ట్స్, బిగ్ బాస్ బ్యూటీ సరయు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె నోరు తెరిచింది అంటే నోటి నుంచి బూతు పదాలు బయటకు వస్తాయి. ఇలా బూతులతో ఎంతో ఫేమస్ అయిన సరియు నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా ఈమె హిందూ మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడంతో ఈమె పై పోలీస్ కేసు పెట్టిన సంగతి మనకు తెలిసిందే.ఓ హోటల్ ప్రచార పాటలో భాగంగా హిందూ మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారని ఈమెపై 153a, 295a సెక్షన్ ల కింద బంజారాహీల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
హోటల్ ప్రమోషన్ పాటలో భాగంగా సరయు మద్యం తాగుతూ… గణపతి బప్పా మోరియా బ్యాండ్‌ను తలకు ధరించారని రాజన్న సిరిసిల్ల విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు చేపూరి అశోక్ ఆదివారం ఈమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదులో భాగంగా
దేవుడి బొమ్మలు ధరించి.. లిక్కర్ సేవించి హోటల్‌ను సందర్శిస్తారనే సంకేతాన్ని ఈ ప్రమోషన్ ద్వారా తెలియజేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని పేర్కొన్నారు.
ఈ విధంగా ఈమె పై పోలీస్ కేసు నమోదు అవడంతో సోమవారం అర్థరాత్రి బంజారా హిల్స్ పోలీసులు బిగ్ బాస్ కంటెస్టెంట్ సరయును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు బుల్లితెర కార్యక్రమాల ద్వారా సందడి చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఈ విధమైనటువంటి వివాదంలో చిక్కుకున్నారు. అదే విధంగా బిగ్ బాస్ విన్నర్ విజయ్ నటించిన ‘సకల గుణాభిరామ’ సినిమా లో సరయు కీలక పాత్రలో నటిస్తున్నారు.
సామాజిక మాధ్యమాల్లో అప్పుడప్పుడు కనిపించే కొన్ని సంఘటనలు మనసును హత్తుకుంటాయి. తాజాగా అలాంటి ఓ మధుర ఘటన నెటిజన్ల హృదయాలను…
పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారత్‌కు ఒక కీలక ఊరట లభించింది. దేశానికి అవసరమైన వంటగ్యాస్ సరఫరాలో…
వేసవి కాలం రాగానే మార్కెట్‌లలో మామిడి పండ్ల రద్దీ పెరుగుతుంది. అయితే ఈ డిమాండ్‌ను అవకాశంగా తీసుకుని కొందరు వ్యాపారులు…
కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక హృదయవిదారక ఘటన సమాజాన్ని కలచివేసింది. పసిపాపల నవ్వులతో కళకళలాడాల్సిన ఓ ఇల్లు ఒక్కసారిగా విషాదంలో…
దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా భూమి కంపించడం ప్రజల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. కొద్ది సెకన్ల పాటు…
శ్రీకాకుళం జిల్లాలో ఒకేసారి పలువురు అస్వస్థతకు గురవడంతో కలకలం చెలరేగింది. గ్రామీణ మండలం సింగుపురంలో జరిగిన జాతర సందర్భంగా బాదం…