Shivaji: బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో శివాజీ ఒకరు. ఈయన ఈ కార్యక్రమం ద్వారా చివరి వరకు కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇకపోతే శివాజీ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్ల గురించి తన కెరియర్ గురించి అలాగే రాజకీయాల గురించి మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా శివాజీ రాజకీయాల గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నేను తెలంగాణకు మాత్రమే మద్దతు తెలుపుతానని తెలిపారు. 50 ఏళ్ల పాటు పోరాటం చేసి తెలంగాణను సంపాదించుకున్నామని ఈయన తెలిపారు. అయితే నేను కేసీఆర్ కి లేదా చంద్రబాబు జగన్ కి మద్దతు తెలపడం లేదని ఈయన వెల్లడించారు.
ఇక నేను పలానా పార్టీలోకి వెళ్తాను అంటూ చాలామంది ప్రశ్నలు కూడా వేస్తున్నారని అయితే నేను రాజకీయాలలోకి వెళ్లడం లేదని రాజకీయాలకి నేను పనికిరాను అంటూ ఈ సందర్భంగా శివాజీ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఫైనల్ అవుతున్నాయి. అలా కాదని ఎవరైనా నన్ను రాజకీయాలలోకి లాగాలని ప్రయత్నాలు చేస్తూ కామెంట్లు చేస్తే నేను అసలు ఊరుకోనని వారి తాటతీస్తాను అంటూ ఈయన వెల్లడించారు.
సినిమాలపైనే దృష్టి…
ఇక తన పిల్లలు తనని కేవలం వెండితెరపై మాత్రమే చూడాలని కోరుకుంటున్నారు అందుకే నేను నా దృష్టిని మొత్తం సినిమాలపైనే పెట్టాను. తిరిగి ఇండస్ట్రీలోకి రాబోతున్నానని, రాజకీయాలపై నాకు ఏమాత్రం ఆసక్తి లేదు అంటూ ఈ సందర్భంగా శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…
స్టార్ హీరోయిన్ త్రిషపై తమిళనాడులో జరిగిన తాజా రాజకీయ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్…
రివ్యూ: A Beautiful Breakup ప్రేమ కథలు సాధారణంగా కలిసే క్షణంతో మొదలై, కలిసి ముగుస్తాయి. కానీ ‘ఎ బ్యూటిఫుల్…