Shivaji: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారిలో నటుడు శివాజీ ఒకరు హీరోగా వెండి తెరపై సందడి చేసినటువంటి ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో చివరి వరకు కొనసాగినటువంటి శివాజీ టాప్ త్రీ కంటెస్టెంట్ గా బయటకు వచ్చారు.
ఈ కార్యక్రమం తర్వాత ఇటీవల బుల్లి తెరపై ప్రసారమైన నా సామిరంగా అనే కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో నాగార్జున కూడా సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నాగార్జున శివాజీని ప్రశ్నిస్తూ బిగ్ బాస్ తర్వాత మీ లైఫ్ ఎలా ఉందని అడిగారు. ఈ ప్రశ్నకు శివాజీ ఆసక్తికరమైనటువంటి సమాధానం చెప్పారు.
బిగ్ బాస్ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమమని ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో కొన్ని వారాలైన హౌస్ లో ఉండాలని ఈయన తెలిపారు. బిగ్ బాస్ కార్యక్రమం గురించి ఎక్కడికి వెళ్లినా నేను గొప్పగానే చెబుతాను అంటూ ఈయన వెల్లడించారు. ఇక బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లకముందు నాకు సైట్ ఉండేది కానీ అక్కడికి వెళ్లిన తర్వాత ఎలాంటి ఫోన్స్ లేకపోవడంతో నా కంటి చూపు చాలా మెరుగుపడిందని శివాజీ తెలిపారు.
కంటి చూపు మెరుగుపడింది..
ఇలా ఈ షో నా కళ్ళపై చాలా మంచి ప్రభావాన్ని చూపించిందని శివాజీ తెలిపారు. అయితే బయటకు వచ్చిన తర్వాత తిరిగి ఫోన్ తీసుకోవడంతో తన కంటి చూపు యధావిధిగా తగ్గుతూ వచ్చిందని ఈయన వెల్లడించారు. శివాజీ ఇలాంటి కామెంట్ చేయడంతో నాగార్జున కూడా అందుకే నేను సండే నా ఫోన్ మొత్తం స్విచ్ ఆఫ్ చేసి పెడతానని ఆ రోజు ఎవరిని కలవకుండా ఇంట్లోనే ఉంటాను అంటూ ఈ సందర్భంగా నాగార్జున చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…