తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులు ఈ షోలో జరిగే టాస్క్‌లు, ఎమోషన్స్, మరియు కంటెస్టెంట్ల మధ్య తగాదాలను ఆసక్తిగా చూస్తారు. ఇప్పటికే ఎనిమిది సీజన్‌లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో, త్వరలో 9వ సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సీజన్‌కు కూడా అక్కినేని నాగార్జున హోస్ట్ చేయనున్నారు.
కొత్త సీజన్‌కు సంబంధించిన ప్రోమోలో నాగార్జున “ఈసారి చదరంగం కాదు… రణరంగమే” అని చెప్పడంతో, అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఈ సీజన్ మరింత యాక్షన్, డ్రామాతో నిండి ఉంటుందని తెలుస్తోంది.
9వ సీజన్ కోసం, ‘బిగ్ బాస్ సీజన్ 9 అగ్నిపరీక్ష’ పేరుతో ఒక స్పెషల్ కాంటెస్ట్ నిర్వహించారు. బిగ్ బాస్ కంటెస్టెంట్ అవ్వాలనుకునే వారికి వీడియో పంపే అవకాశం ఇచ్చి, వాటిలో నుండి షార్ట్‌లిస్ట్ చేసిన 100 మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ‘అగ్నిపరీక్ష’ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి శ్రీముఖి హోస్ట్ చేస్తుండగా, జడ్జీలుగా మాజీ బిగ్ బాస్ విజేతలైన అభిజిత్, నవదీప్, బిందుమాధవి వ్యవహరిస్తున్నారు.
ఈ కార్యక్రమం ఆగస్టు 09 నుండి 19 వరకు షూటింగ్ జరుపుకొని, ఆగస్టు 22 నుండి జియో హాట్‌స్టార్లో ప్రసారం కానుంది. దీనిని మొత్తం 13 ఎపిసోడ్‌లుగా ప్లాన్ చేశారు.
తాజాగా లీకైన ఒక ఎపిసోడ్‌లో ఒక హైలైట్ సీన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అందులో జడ్జిగా ఉన్న బిందుమాధవి ఒక కంటెస్టెంట్‌పై “ఎందుకు అంత ఓవరాక్షన్ చేస్తున్నావ్?” అంటూ సీరియస్ అయ్యారు. అదే సమయంలో పక్కనే ఉన్న నవదీప్ “హే పో” అంటూ ఆగ్రహంగా లేచి వెళ్లిపోయారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన కొత్త సీజన్‌పై మరింత ఆసక్తిని పెంచింది.
స్టార్ హీరోయిన్ త్రిషపై తమిళనాడులో జరిగిన తాజా రాజకీయ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్…
రివ్యూ: A Beautiful Breakup ప్రేమ కథలు సాధారణంగా కలిసే క్షణంతో మొదలై, కలిసి ముగుస్తాయి. కానీ ‘ఎ బ్యూటిఫుల్…
యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ‘ఫంకీ’ ఈరోజు థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వాలెంటైన్ వీక్‌ను…
భారత క్రికెట్ చరిత్రలో తరచూ కొత్త ప్రతిభలు వెలుగులోకి వస్తుంటాయి. కానీ కొన్ని ప్రతిభలు మాత్రం తొలి అడుగులోనే అందరి…
టీవీ సీరియల్స్, రియాలిటీ షోస్, ముఖ్యంగా బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించిన అమర్ దీప్ చౌదరి ఇప్పుడు…
యాక్షన్ చిత్రాలతో దక్షిణాదిలో ప్రత్యేక గుర్తింపు పొందిన అర్జున్ సర్జా ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన స్వయంగా…