Biggboss Kaushal: బుల్లితెర సీరియల్స్ లో నటుడిగా నటించి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న కౌశల్ వెండితెరపై పలు సినిమాలలో కూడా నటించి మెప్పించారు. అయితే ఈయనకు ఉన్న పాపులారిటీతో ఈయన బిగ్ బాస్ అవకాశాన్ని అందుకొని ఏకంగా విన్నర్ గా బయటకు తిరిగివచ్చారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న కౌశల్ ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న బీ బీజోడి కార్యక్రమంలో కంటెస్టెంట్గా పార్టిసిపేట్ చేస్తున్నారు.
ఇకపోతే తాజాగా కౌశల్ నూతన గృహప్రవేశం చేసినట్టు తెలుస్తోంది. ఈయన ఈ ఇంటిని తన తండ్రికి సర్ప్రైజ్ గిఫ్ట్ గా అందించారని తెలుస్తోంది. 2021 వ సంవత్సరంలో ఫాదర్స్ డే సందర్భంగా కౌశల్ తండ్రి తన కోరికను బయట పెడుతూ ఎప్పటికైనా తనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని తన కోరిక అని అది కూడా వైజాగ్లో ఉండాలని తన కోరిక అంటూ తెలియజేశారు.
ఈ విధంగా కౌశల్ తండ్రి కోరిక చెప్పడంతో ఎలాగైనా తన తండ్రి కోరిక నెరవేర్చాలన్న ఉద్దేశంతో కౌశల్ హైదరాబాదులో తన తండ్రికి ఒక ఇంటిని కొనుగోలు చేసి తనకు సర్ప్రైజ్ ఇచ్చారు.ప్రస్తుతం ఈ ఇంటి గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే కౌశల్ తండ్రి వైజాగ్ లో తనకు ఇల్లు కావాలని కోరగా ఈయన మాత్రం హైదరాబాద్లో తనకు ఇల్లు కొనిచ్చారు.
ప్రస్తుతం తన తండ్రి హైదరాబాదులోనే ఉండటం వల్ల తనకు హైదరాబాద్ లోనే ఇంటిని కొనుగోలు చేసినట్టు కౌశల్ తెలిపారు.ఇలా ఈ ఇంటిని కొనుగోలు చేసి తన తండ్రి కోరిక తీర్చాలని తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానంటూ ఈయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కౌశల్ కొత్త ఇంటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…