Bimbisara Movie: నందమూరి హీరో కళ్యాణ్ రామ్ గత కొంతకాలం నుంచి వరుస ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా సోసియో ఫాంటసీ టైం ట్రావెల్ చిత్రం బింబిసారా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా విడుదలైన నాలుగు రోజులలోనే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసి లాభాల బాటలో పయనిస్తోంది.
ఇక ఈ సినిమాని కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో నిర్మించగా ఈ సినిమా ద్వారా వశిష్ట అనే దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కళ్యాణ్ రామ్ ఎప్పుడూ కూడా టాలెంట్ ఉన్న దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈయన పరిచయం చేసిన దర్శకులు ఇండస్ట్రీలో అగ్ర దర్శకులుగా కొనసాగుతున్నారు. తాజాగా వశిష్టకు అవకాశం కల్పించడంతో ఆయన టాలెంట్ బింబిసారా సినిమా ద్వారా నిరూపించుకున్నారు.
ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ నటనకు టాలీవుడ్ ప్రముఖ హీరోలు సైతం ప్రశంసలు కురిపించారు. ఇందులో కళ్యాణ్ రామ్ సరసన నటి సంయుక్త మీనన్ కేతరిన్ హీరోయిన్లుగా నటించారు. ఇకపోతే ఈ సినిమా కథతో వశిష్ట ముందుగా కళ్యాణ్ రామ్ ని కాకుండా నలుగురు హీరోలను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ నలుగురు హీరోలు కూడా ఈ సినిమానే రిజెక్ట్ చేయడంతోనే ఆ అవకాశం కల్యాణ్ రామ్ కు వచ్చిందని సమాచారం.
బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాని రిజెక్ట్ చేసిన ఆ నలుగురు హీరోలు ఎవరు అనే విషయానికి వస్తే..వశిష్ట ముందుగా ఈ సినిమా కథతో నితిన్ వద్దకు వెళ్లారట నితిన్ ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతో ఈయన ఎనర్జిటిక్ స్టార్ రామ్, రాజ్ తరుణ్, అల్లు శిరీష్ వంటి హీరోలను సంప్రదించారట.అయితే ఈ నలుగురు హీరోలు ఈ సినిమాను రిజెక్ట్ చేయడంతో ఈ అవకాశం కళ్యాణ్ రామ్ కి వచ్చిందని చెప్పాలి.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…