BJP Leader Raghunandan reddy : కవిత అరెస్టు అయితే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి…: బీజేపీ నేత రఘునందన్ రెడ్డి

BJP Leader Raghunandan reddy : తెలంగాణ రాజకీయంలో ఒకవైపు అధికార పార్టీ తెరాస మీద కొంచం సందు దొరికితే చాలు బీజేపీ పార్టీ ఆసలు వదలకుండా విమర్శలు గుప్పిస్తుంది. ఇక తెరాస అధినేత చంద్రశేఖర్ రావు గారు తెరాసను నేషనల్ పార్టీగా ప్రకటించిన తరువాత రాజకీయ వేడి మరింత ఎక్కువైంది. ఇక లిక్కర్ స్కాం ఎంత ప్రకంపణలు సృష్టించిందో తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కాం తీగ లాగితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో డొంక కదిలింది. ఇందులో చంద్రశేఖర్ రావు కూతురు కవిత, ఏపీ వైసీపీ నేతలు ఉండటంతో మరింత రాజకీయ వేడి రాజుకుంది. ఇక తాజాగా వినిపిస్తున్న వార్త కవితను లిక్కర్ స్కాంలో అరెస్ట్ చేస్తారు అనే వార్త జోరుగా వినిపిస్తోంది. దీని గురించిన ఆసక్తికర విషయాలను బీజేపీ లీడర్ రఘునందన్ రెడ్డి గారు మాట్లాడారు.

కవితను కాపాడుకోడానికి కెసిఆర్ ఏమైనా చేస్తాడు…

కవితను లిక్కర్ స్కాంలో అరెస్ట్ చేస్తారు అనే వార్తలను నేపథ్యంలో రఘునందన్ రెడ్డి గారు మాట్లాడుతూ కవిత అరెస్ట్ అయితే బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రాదు. కెసిఆర్ కుటుంబానికి ఏదైనా జరిగితే అది తెలంగాణ కు జరిగినట్లు ఆపాదించడం తప్పు. కెసిఆర్ కుటుంబం మాత్రమే తెలంగాణలో లేదు. కవిత నిజామాబాద్ లో ఎలా ఓడిపోయింది.

ఇక కవిత, కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు కాకుండా తెరాసలో నేతలు లేరా, వాళ్లంతా ఎలా గెలిచారు, వారిని చూసి జనాలు ఓట్లేసారు. అంతే కానీ ఒక్క కవిత అరెస్టు తోనే బీజేపీ అధికారంలోకి వస్తుందనుకోవడం మూర్ఖత్వం అంటూ చెప్పారు. ఇక కవితను కాపాడుకోడానికి కెసిఆర్ ప్రయత్నించకుండా ఉంటాడా, పిల్లల్ని కాపాడుకోడానికి ఏ తండ్రి అయినా పోరాడుతాడు అంటూ చెప్పారు.