Actress Meena: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో నటి మీనా ఒకరు. ఈమె బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం హీరోయిన్ గా తెలుగు తమిళ భాషలలో అగ్ర హీరోలందట సరసన నటించి మెప్పించారు. ఇలా హీరోయిన్ గా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సమయంలోనే ఈమె విద్యాసాగర్ అనే ఇంజనీర్ ను వివాహం చేసుకున్నారు.
వివాహం తర్వాత కాస్త సినిమాలను తగ్గించిన మీనా అనంతరం పాప జన్మించిన తర్వాత తిరిగి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇలా తన సెకండ్ ఇన్నింగ్స్ వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి మీనా జీవితంలో విషాదం చోటుచేసుకుంది.మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గత ఏడాది మరణించిన విషయం మనకు తెలిసిందే.
ఇలా భర్త మరణంతో కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి మీనా తిరిగి సినిమా షూటింగ్ పనులతో బిజీగా మారిపోతున్నారు. ఇకపోతే ఇండస్ట్రీకి వచ్చి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తాజాగా ఈమె ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన సినీ కెరియర్ గురించి పలు విషయాలు తెలియజేశారు.
తాను ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అంటే తనకు ఎంతో ఇష్టం ఉండేదని తెలిపారు.తనని చాలాకాలంగా ప్రేమించానని అయితే తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్న తన తల్లికి కూడా హృతిక్ లాంటి అబ్బాయిని చూడమని చెప్పానని తెలిపారు.అయితే హృతిక్ రోషన్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త తెలియగానే నా గుండె పగిలిపోయిందని అప్పటికి ఇంకా తనకు పెళ్లి కాలేదు అంటూ ఈ సందర్భంగా తనకు హృతిక్ రోషన్ అంటే ఎంత ఇష్టమో తెలియజేస్తూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…