C. Kalyan : తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతగా తనకంటూ గుర్తింవు తెచ్చుకున్న సి కళ్యాణ్, సికే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద పలు సినిమాలను నిర్మించారు. ఫిల్మ్ ఛాంబర్ రాజకీయాల్లోనూ ఉండే కళ్యాణ్ పూరీ జగన్నాథ్ తో ఎక్కువగా ట్రావెల్ అయ్యారు. అటు మెగా కుటుంబంతో సినిమా చేసిన కళ్యాణ్ ఇటు నందమూరి హీరోలతోనూ సినిమాలు చేసారు. పూరీ కాంబినేషన్ లో ‘జ్యోతి లక్ష్మి’ సినిమా తో మొదలు పెట్టి ఆ తరువాత ‘లోఫర్’ సినిమా కూడా చేసాడు. ఇక పలు ఇంటర్వ్యూ ల్లో సినిమా ఇండస్ట్రీ గురించి కామెంట్స్ చేసే కళ్యాణ్ మెగా ఫ్యామిలీ కి ఎందుకు దూరంగా ఉన్నారో చెప్పారు.
బాలయ్య బాబు ముక్కుసూటి మనిషి…
జ్యోతి లక్ష్మి సినిమాను నిర్మించిన కళ్యాణ్ ఆ తరువాత లోఫర్ సినిమాను మెగా కాంపౌండ్ హీరో వరుణ్ తేజ్ తో తీశారు. ఆ తరువాత బాలకృష్ణ తో ‘జై సింహ’ సినిమాను కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో నిర్మించారు. ఇక వినాయక్ దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా ‘ఇంటెలిజెంట్’ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమా వల్ల నష్టపోయానంటూ కళ్యాణ్ చెప్పారు. నాగబాబు తో ఉన్న సాన్నిహిత్యం వల్ల వరుణ్ తేజ్ ను నా కొడుకు అన్నట్లు గా భావించాను. తను అప్పటి వరకు తీసుకున్న రెమ్యూనరేషన్ కన్నా ఎక్కువ ఇచ్చాను లోఫర్ సినిమా ప్లాప్ అయి నష్టమొచ్చినా మెగా కుటుంబం నుండి స్పందన లేదు. ఇక వినాయక్ తో ఎప్పటినుండో సినిమా తీయాలనీ అనుకున్నాను. వినాయక్ నాకు చాలా ఆప్తుడు అందుకే ఒక ప్రాజెక్ట్ అనుకున్నా అప్పుడు కుదరలేదు మళ్ళీ ఇంటెలిజెంట్ సినిమాను సాయి ధరమ్ తేజ్ తో వినాయక్ కాంబినేషన్ లో తీసాము. వినాయక్ మీద అభిమానం, నమ్మకం తో ఎక్కువ బడ్జెట్ పెట్టాము అయితే బాగా నష్టమొచ్చింది, అప్పుడు కూడా మెగా కుటుంబం స్పందించలేదు. ఇక చిరంజీవి గారితో నాకు పెద్ద పరిచయాలు లేవు, ఇక పవన్ తో సినిమా అవకాశం అదృష్టంగా భావిస్తాను.
ఇక చరణ్ చాలా మంచి అబ్బాయి అంటూ చెప్పారు మెగా ఫ్యామిలీ తో విబేధాలు లేవు కానీ ఆ రెండు సినిమాల వల్ల కొంత దూరంగా ఉన్నాను అంటూ చెప్పారు. ఇక బాలకృష్ణ గురించి మాట్లాడుతూ బాలకృష్ణ చాలా ముక్కుసూటి మనిషి అంటూ చెప్పారు. ఏదైనా సినిమా ఇండస్ట్రీ కి సంబంధిచిన విషయాలు అయన దగ్గరకు తీసుకెళ్లాడానికి చాలా మంది భయపడతారు కానీ నాకు అయన దగ్గర ఆ చనువు ఉంది. వెళ్లి ఆయనతో సమస్య చెప్పగలను అలాగే ఏదైనా ఇండస్ట్రీ కి సహాయం లేదా ఎవరైనా వ్యక్తులకు సహాయం చేయాలన్న అయన దగ్గరికి వెళితే స్పందిస్తారు. ఇక ఆయనకు నచ్చకపోతే ఖచ్చితంగా అప్పుడే నచ్చలేదని చెప్పేస్తారు చాలా మంచి వ్యక్తి అంటూ చెప్పారు.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…