బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా శిల్పాశెట్టికి మరొక షాక్ తగిలింది. ఆమె తల్లి సునందపై చీటింగ్ కేసు నమోదైంది. లక్నోలోని రెండు పోలీసు స్టేషన్‌లో ఆమెపై చీటింగ్ కేసులు నమోదయ్యాయి. అయోసిస్ వెల్‌నెస్ అండ్ స్పా పేరుతో శిల్పాశెట్టి ఓ ఫిట్‌నెస్ సెంటర్ ను నిర్వహిస్తోంది. దీనికి ఆమె చైర్మన్ గా, ఆమె తల్లి సునంద డైరెక్టర్ గా ఉన్నారు.
మరో బ్రాంచ్ ను లక్నోలో ఈ ఫిట్‌నెస్ సెంటర్ ను ప్రారంభించేందుకు జ్యోత్స్న చౌహాన్, రోహిత్ వీర్ సింగ్ అనే ఇద్దరి నుంచి కోట్ల రూపాయలు తీసుకున్నారు. అయితే ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో శిల్పా, ఆమె తల్లి సునందలు తమ వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
బాధితులు వీరిద్దరిపై లక్నోలోని హజరత్ గంజ్, విభూతి ఖండ్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు రెండు బృందాలుగా ఎర్పడి విచారణ చేపట్టారు. ఈ రెండు బృందాలకు డీసీపీ సంజీవ్ సుమన్ అధికారిగా ఉన్నారు. ఇప్పటికే శిల్పాను, ఆమె తల్లిని విచారించేందుకు ఒక బృందంతో డీసీపీ ముంబై చేరుకున్నారు.
ఈ వ్యవహారంపై డీసీసీ సంజీవ్ సుమన్ మాట్లాడుతూ.. ఈ విషయం ఉన్నత స్థాయికి చేరిందని, అందువల్ల పోలీసులు అన్ని అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నారని ఆయన తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకున్న తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…