Cheranjeevi : సుక్కు డైరెక్షన్ లో మెగాస్టార్ నటించారు. సినిమాకోసం కాదులెండి ఒక యాడ్ షూటింగ్ కోసం సుక్కు తో మెగాస్టార్ కలిసి పని చేసారు. ఇక ఈ షూటింగ్ లో న్యూ లుక్ తో ఆదరగోట్టేసాడు. మళ్ళీ యంగ్ చిరు కనిపించాడు దీంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తాజాగా మెగాస్టార్ తో ఓ యాడ్ ను షూట్ చేస్తున్నారు సుకుమార్. ఈరోజు ఉగాది సందర్భంగా ఆ యాడ్ ను రిలీజ్ చేసారు. ప్రస్తుతం ఈ విడియో యూట్యూబ్ ను షేక్ చేస్తుంది.
‘దర్శకుడిగా సుకుమార్ ప్రతిభ అందరికి తెలిసిందే. ఓ యాడ్ ఫిల్మ్ కోసం వారి దర్శకత్వంలో నటించాను. షూటింగ్ ని చాలా ఎంజాయ్ చేశాను` అంటూ తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు చిరు. ప్రస్తుతం ఈ ఫొటోలు, యాడ్ ఫిలిం నెట్టింట వైరల్ గా మారాయి. శుభగృహ సంస్థ కోసం చేసిన యాడ్ లో మెగాస్టార్ నటించారు. ఇక ఈ యాడ్ సుకుమార్ డైరెక్ట్ చేసారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో ఫేమస్ అయిన సుకుమార్ పుష్ప 2 షూటింగ్ మొదలుపెట్టేసారు.
ఇక మెగాస్టార్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒక వైపు కొరటాల శివ డైరెక్షన్లో ఆచార్య పూర్తి చేస్తూనే గాడ్ ఫాదర్ షూటింగ్ లోనూ పాల్గొంటున్నారు. ఇది మలయాళం సినిమా లూసీఫర్ కు రీమేక్. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం చేస్తున్నారు. మలయాళంలో లూసీఫర్ సినిమా సూపర్ హిట్ అయింది. అలాగే మెహర్ రమేష్ డైరెక్షన్ లో వేదాళం రీమేక్ భోళాశంకర్ సినిమాలో నటిస్తున్నారు . ఈ సినిమా తర్వాత బాబీ దర్శకత్వంలో ఓ మాస్ మసాలా సినిమా చేయనున్నారు . ఈ సినిమాకు వాల్తేరు వీరన్న అనే టైటిల్ ను అనుకుంటున్నారు.
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కు సంబంధించి కాపీరైట్ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. 1976 నుంచి 2001 మధ్య…
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. కుటుంబ వివాదాలు ఎంతటి విషాదానికి దారి తీస్తాయో చూపించే సంఘటనగా ఇది…
దేశంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక…
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంపై ఆసక్తి నెలకొంది. ఒకవైపు ఉదయాన్నే చల్లని గాలులు తాకుతుండగా, మధ్యాహ్నానికి…
ఉద్యోగులు ప్రతీ నెల జీతం నుంచి కొంత మొత్తం పీఎఫ్‌గా కట్ అవుతుందని తెలుసు. కానీ ఆ డబ్బు నిజంగా…