Chiranjeevi : అప్పటిలోనే బాలీవుడ్ పై టాలీవుడ్ సంచలనం…ఏకంగా అమితాబ్ నే దాటేసిన మన మెగా స్టార్…!

Chiranjeevi : ప్రస్తుతం బాలీవుడ్ పై టాలీవుడ్ తన సత్తా ఏమిటో చూపిస్తోంది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో మన తెలుగు సినిమాల సత్తా ఏంటో తెలియజేసారు. అయితే తాజాగా వచ్చిన హిందీ వెర్షన్ లో విడుదల అయిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఏకంగా మొదటి రోజే రూ. 25 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి రికార్డు క్రియేట్ చేసింది. అంతే కాకుండా ఆర్ఆర్ఆర్ సినిమా దెబ్బకి ఆ సమయంలో విడుదల అయిన రన్వీర్ సింగ్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, జాన్ అబ్రహం లాంటి బాలీవుడ్ హీరోల సినిమాలు సైతం భారీ నష్టాలను చూసాయి. అంతే కాకుండా కనీసం రూ.5 కోట్ల ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయాయి.

పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాలతో పోటీపడిన బాలీవుడ్ సినిమాలు ప్లాప్ లుగా నిలిచాయి. అంతే కాకుండా దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోగా మన తెలుగు హీరో నిలుస్తున్నాడు. బాహుబలి సినిమాతో ప్రభాస్ దేశంలోనే అధిక రెమ్యునరేషన్ తీసుకుఅంటున్న హీరోగా రికార్డు ను సృష్టించారు . ప్రస్తుతం ప్రభాస్ ఏకంగా రూ. 150 కోట్లు తీసుకుంటున్నారు. కాగా ఇటువంటి రికార్డుని అప్పటిలోనే మెగాస్టార్ క్రియేట్ చేశారు.

దేశంలోనే అధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోగా……

అప్పట్లో 1990 ల ప్రారంభంలో జగదేకవీరుడు అతిలోకసుందరి, గ్యాంగ్ లీడర్ వంటి వరుస బ్లాక్ బస్టర్ సినిమాల ఇమేజ్ తో చిరంజీవి టాలీవుడ్ లో టాప్ హీరోగా వెలిగాడు. ఆ సమయంలో ఆయనతో సినిమా చేయాలంటే నిర్మాతలు క్యూ కట్టేంతగా ఆయన డిమాండ్ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే చిరంజీవి ఒక సినిమాకి 1992 లో రూ. 1.25 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారు. అప్పటిలో దేశంలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ అది. దీంతో దేశవ్యాప్తంగా అది ఒక హాట్ టాపిక్ అయ్యింది.

ఆ సమయంలో బాలీవుడ్ లో షారుఖ్, సల్మాన్ ఇంకా కెరీర్ మొదటి దశలోనే వున్నారు. అప్పటికి ఇంకా అమితాబ్ దేశంలో అతిపెద్ద హీరోగా వున్నారు. ఆ సమయంలో అమితాబ్ పారితోషకం కోటి రూపాయలకు అటు ఇటుగా వుండేదట. అప్పట్లోనే బాలీవుడ్ హీరోల కంటే మన మెగాస్టార్ ఎక్కువ పారితోషకం తీసుకొని దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశారు. అందుకు 1992  ఓ నేషనల్ మీడియా చిరంజీవి కవర్ పేజీతో ఒక ఆర్టికల్ ప్రచురించింది. ది వీక్ అనే మ్యాగజైన్, చిరంజీవి బాలీవుడ్ స్టార్ అమితాబ్ కంటే అధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారంటూ కథనం ప్రచురించింది. 1992 సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఈ ఆర్టికల్ ది వీక్ ఎడిషన్ లో రాయడం జరిగింది