Featured

Krishna Vamsi : “సింధూరం” చిత్రానికి చేసిన అప్పులు తీర్చడానికే “సముద్రం” చేశాను.. ఐనా ఆ సినిమా దెబ్బ కొట్టింది : కృష్ణవంశీ

Krishna Vamsi : పసుపులేటి కృష్ణవంశీ దర్శకుడు. రామ్ గోపాల్ వర్మ దగ్గర కొన్ని చిత్రాలకు సహాయకుడిగా పనిచేసాడు. తన తొలి చిత్రం గులాబీతో మంచి పేరు తెచ్చుకున్నాడు. 2000వ సంవత్సరంలో ఆంధ్రా టాకీస్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. నటి రమ్యకృష్ణను పెళ్ళి చేసుకున్నాడు.
జీవిత భాగస్వామి రమ్య కృష్ణ, పిల్లలు రిత్విక్ తోడుగా ఉన్నారు.

తెలుగు సినిమా పరిశ్రమలో కృష్ణవంశీ సృజనాత్మక దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. తెలుగు సినిమాకు క్రొత్త ఒరవడిని పరిచయం చేసిన రామ్ గోపాల్ వర్మ వద్ద శిష్యరికం చేయక ముందు కొన్నాళ్ళపాటు త్రిపురనేని వరప్రసాద్ అనే దర్శకుడి దగ్గర సహాయకుడిగా ఉన్నాడు. వర్మ వద్ద చేరిన తరువాత కొన్నాళ్ళకు అనగనగా ఒక రోజు చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం లభించినా బడ్జెట్ పరిధి దాటిపోతుండడంతో అతడిని ఆ బాధ్యత నుండి తప్పించడం జరిగింది. కానీ ఆయన ప్రతిభను గమనించిన వర్మ కార్పొరేషన్ బ్యానర్లోనే గులాబి అనే చిత్రంతో మరో అవకాశం వచ్చింది. వర్మ శిష్యులు వర్మ పద్ధతిలోనే చిత్రాలు తీస్తారన్న అపప్రధను చెరిపేసినవాడు కృష్ణవంశీ. కేవలం గులాబీ చిత్రంలోని పాటల చిత్రీకరణ చూసి, అతనికి అక్కినేని నాగార్జున రెండవ చిత్రానికి అవకాశం ఇచ్చాడు.

హిందీలో సల్మాన్ ఖాన్ మాధురి దీక్షిత్ హీరో హీరోయిన్లుగా “హమ్ ఆప్ కె హై కౌన్” అనే చిత్రం విడుదలైంది. ఆ సినిమా చూసి ప్రేరణ పొందిన కృష్ణవంశీ. అలాంటి షేడ్స్ ఉన్న ఒక కథతో సినిమా తీయాలనుకున్నారు. ఆ సినిమా పేరు “నిన్నే పెళ్ళాడుతా”. ఈ సినిమాలో నాగార్జున, టబు హీరో హీరోయిన్లుగా నటించారు. మంచి పాటలు, కథ కథనంతో సినిమా సూపర్ హిట్ అయింది. తరువాత కృష్ణవంశీ స్వయంగా సినీ నిర్మాణం చేపట్టి ‘ఆంధ్రా టాకీస్’ సంస్థను ప్రారంభించాడు. నక్సల్ సమస్యను అద్భుతమైన భావోద్వేగాలతో రంగరించి రవితేజ, బ్రహ్మాజీ, సంఘవి హీరో, హీరోయిన్లుగా “సింధూరం” చిత్రాన్ని రూపొందించారు. స్టార్స్ లేకపోయినప్పటికీ ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందినా, ఆర్థికంగా క్రుంగదీసింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను రాబట్ట లేకపోయింది.

ఆ సినిమా కోసం చేసిన అప్పులను తీర్చడానికి జగపతిబాబు, సాక్షిశివానంద్, శ్రీహరి, శివాజీ లాంటి ముఖ్య పాత్రలతో “సముద్రం”  సినిమా రూపొందించారు. ఈ సినిమాలో నటించిన తనికెళ్ల భరణికి ఉత్తమ ప్రతి కథానాయకుడిగా అవార్డు పొందారు. అయితే ఈ సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. గులాబీ, నిన్నే పెళ్ళాడుతా లాంటి చిత్రాల లాభాలను సింధూరం, సముద్రం చిత్రాలు తీసుకురాలేకపోయాయి. ఆ రెండు సినిమాల ప్రభావం తన సినీ జీవితంపై పడిందని స్వయంగా కృష్ణవంశీ ఓ ఇంటర్వ్యూలలో చెప్పారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

5 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

6 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

13 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

14 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

14 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

1 day ago