Chiranjeevi : ప్రస్తుతం బాలీవుడ్ పై టాలీవుడ్ తన సత్తా ఏమిటో చూపిస్తోంది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో మన తెలుగు సినిమాల సత్తా ఏంటో తెలియజేసారు. అయితే తాజాగా వచ్చిన హిందీ వెర్షన్ లో విడుదల అయిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఏకంగా మొదటి రోజే రూ. 25 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి రికార్డు క్రియేట్ చేసింది. అంతే కాకుండా ఆర్ఆర్ఆర్ సినిమా దెబ్బకి ఆ సమయంలో విడుదల అయిన రన్వీర్ సింగ్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, జాన్ అబ్రహం లాంటి బాలీవుడ్ హీరోల సినిమాలు సైతం భారీ నష్టాలను చూసాయి. అంతే కాకుండా కనీసం రూ.5 కోట్ల ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయాయి.
పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాలతో పోటీపడిన బాలీవుడ్ సినిమాలు ప్లాప్ లుగా నిలిచాయి. అంతే కాకుండా దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోగా మన తెలుగు హీరో నిలుస్తున్నాడు. బాహుబలి సినిమాతో ప్రభాస్ దేశంలోనే అధిక రెమ్యునరేషన్ తీసుకుఅంటున్న హీరోగా రికార్డు ను సృష్టించారు . ప్రస్తుతం ప్రభాస్ ఏకంగా రూ. 150 కోట్లు తీసుకుంటున్నారు. కాగా ఇటువంటి రికార్డుని అప్పటిలోనే మెగాస్టార్ క్రియేట్ చేశారు.
దేశంలోనే అధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోగా……
అప్పట్లో 1990 ల ప్రారంభంలో జగదేకవీరుడు అతిలోకసుందరి, గ్యాంగ్ లీడర్ వంటి వరుస బ్లాక్ బస్టర్ సినిమాల ఇమేజ్ తో చిరంజీవి టాలీవుడ్ లో టాప్ హీరోగా వెలిగాడు. ఆ సమయంలో ఆయనతో సినిమా చేయాలంటే నిర్మాతలు క్యూ కట్టేంతగా ఆయన డిమాండ్ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే చిరంజీవి ఒక సినిమాకి 1992 లో రూ. 1.25 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారు. అప్పటిలో దేశంలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ అది. దీంతో దేశవ్యాప్తంగా అది ఒక హాట్ టాపిక్ అయ్యింది.
ఆ సమయంలో బాలీవుడ్ లో షారుఖ్, సల్మాన్ ఇంకా కెరీర్ మొదటి దశలోనే వున్నారు. అప్పటికి ఇంకా అమితాబ్ దేశంలో అతిపెద్ద హీరోగా వున్నారు. ఆ సమయంలో అమితాబ్ పారితోషకం కోటి రూపాయలకు అటు ఇటుగా వుండేదట. అప్పట్లోనే బాలీవుడ్ హీరోల కంటే మన మెగాస్టార్ ఎక్కువ పారితోషకం తీసుకొని దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశారు. అందుకు 1992 ఓ నేషనల్ మీడియా చిరంజీవి కవర్ పేజీతో ఒక ఆర్టికల్ ప్రచురించింది. ది వీక్ అనే మ్యాగజైన్, చిరంజీవి బాలీవుడ్ స్టార్ అమితాబ్ కంటే అధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారంటూ కథనం ప్రచురించింది. 1992 సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఈ ఆర్టికల్ ది వీక్ ఎడిషన్ లో రాయడం జరిగింది
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…