Featured

Murali Mohan : ఆ రోజుల్లో మేము.. చిరంజీవిని విలన్ అవుతాడని అనుకున్నాం.. కానీ సినిమాలకే రంకు మొగుడు అయ్యాడు. : మురళీమోహన్

Murali Mohan : ద్వాపరయుగం నాటి మహాభారతం గాథను నేటి సాంఘిక కథగా మార్చి ఒక చిత్రాన్ని తీస్తే ఎలా ఉంటుంది అన్నదానికి నిదర్శనమే మన ఊరి పాండవులు చిత్రం. బాపు రమణల ఊహాత్మక, సృజనాత్మకతకు ప్రతి రూపమే ఆ చిత్రం. మొదటగా ఈ చిత్రాన్ని కన్నడంలో రూపొందించారు ఆ తర్వాత తెలుగులో నిర్మించి తదుపరి హిందీలో హమ్ పాంచ్ గా పునర్నిర్మించారు. మురళీమోహన్ చిరంజీవి, ప్రసాద్ బాబు, భానుచందర్, విజయభాస్కర్ పంచ పాండవుల లాగా కనిపిస్తే కృష్ణంరాజు మహాభారతంలోని శ్రీ కృష్ణుడిని పొలీ ఉంటాడు. 1978 నాటి సామాజిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని కొంత విప్లవాత్మకంగా ముళ్ళపూడి వెంకటరమణ ఈ చిత్ర కథను తీర్చిదిద్దారు.

మన ఊరి పాండవుల చిత్ర నిర్మాత జయకృష్ణ ఒకసారి “ప్రాణం ఖరీదు” చిత్ర నిర్మాత గంగాధర్ ఆఫీసుకు వెళ్లారు. అక్కడ నటీనటుల ఆల్బమ్ చూస్తుండగా.. చిరంజీవి ఫోటో చూశారు. ఆయన ముఖంలో తేజస్సు, ఎర్రటి కళ్ళు జయకృష్ణని బాగా ఆకర్షించాయి. ఆ ఫోటో తీసుకువెళ్లి దర్శకుడు బాపుకు చూపించారు. మన చిత్రంలోని అర్జునుడిని పోలిన పాత్రకు బాగా సరిపోతారని చిరంజీవిని తీసుకుందామనుకున్నారు. అలా మన ఊరి పాండవులు చిత్రంలో హీరో, హీరోయిన్స్ ఉండరని పంచపాండవు లాంటి ఐదుగురు సినిమా మొత్తాన్ని నడిపిస్తారని.. అందులో మీది(చిరంజీవిది) ఒక పాత్ర అని చెప్పడంతో చిరంజీవి ఏమాత్రం ఆలోచించకుండా.. ఆ పాత్ర చేయడానికి అంగీకరించారు.

మన ఊరి పాండవులు చిత్ర షూటింగ్ ఎక్కువ భాగం గ్రామీణ వాతావరణంలో జరిగింది. మన ఊరి పాండవులు మెగాస్టార్ చిరంజీవికి నటన పరంగా ఇది మూడో సినిమా, విడుదలపరంగా రెండవ సినిమా.. ఈ సినిమా షూటింగ్ గోదావరి జిల్లాలో జరుగుతున్న సమయంలో ఒకసారి మురళీమోహన్, కృష్ణంరాజు కబుర్లు చెప్పుకుంటున్న సందర్భంలో.. చిరంజీవి గురించి ప్రస్తావన వచ్చిందని, తనని చిరంజీవి ఎప్పుడూ అన్నయ్య అని పిలుస్తుంటాడని.. భవిష్యత్తులో చిరంజీవి విలన్ అవుతాడు అనుకున్నాం.. కానీ చిరంజీవి ఏకంగా సినిమాలకే రంకు మొగుడు అయ్యారంటూ.. మురళీమోహన్ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చమత్కరించడం జరిగింది. బుల్లితెరను చూస్తున్న ప్రేక్షకులకు ఆ మాటలు ఒకింత ఆచ్చర్యానికి గురిచేసాయి.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ల్యాప్‌టాప్‌ను ఎప్పుడూ ఛార్జింగ్‌లోనే వాడుతున్నారా? నిపుణులు చెప్పిన నిజాలు ఇవే!

ఈ డిజిటల్ యుగంలో ల్యాప్‌టాప్‌లు మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయాయి. ఉద్యోగాలు, ఆన్‌లైన్ క్లాసులు, వ్యాపార కార్యకలాపాలు, వినోదం,…

5 minutes ago

సేఫ్టీ రోప్ లేకుండానే బంగీ జంప్.. క్షణాల్లో ప్రాణాలు కోల్పోయిన యువతి..

అడ్వెంచర్ స్పోర్ట్స్ అంటే యువతలో ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. సాధారణ జీవితానికి భిన్నంగా ఉత్కంఠభరిత అనుభూతిని ఆస్వాదించాలనే కోరికతో వేలాది…

13 minutes ago

అమావాస్య ప్రభావమా?.. స్కూల్ రీఓపెన్ రోజున క్లాస్‌లో ఒక్క విద్యార్థినే!

వేసవి సెలవుల సందడి ముగిసింది. దాదాపు రెండు నెలల విరామం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు మళ్లీ విద్యార్థులతో కళకళలాడాల్సిన రోజు…

2 hours ago

ఈదురుగాలులు, పిడుగులతో భారీ వర్షాలు..మరో 4 రోజులు కుండపోతకు రెడ్ అలర్ట్!

తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. గత కొద్ది రోజులుగా ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వర్షాలు కొంత ఉపశమనం…

2 hours ago

సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో అర్ధరాత్రి దొంగల కలకలం..వెంటాడిన రైల్వే పోలీసులు..

అర్ధరాత్రి వేళ పరుగులు తీస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలులో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. నిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతోందో అర్థం…

2 hours ago

విద్యార్థులకు బూట్లకు బదులు చెప్పులా? కర్ణాటక ప్రభుత్వం కొత్త ఆలోచన..

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని కర్ణాటక ప్రభుత్వం కీలక మార్పుల దిశగా ఆలోచిస్తోంది. ఇప్పటివరకు…

3 hours ago