Movie News

Sunny Leone: ఆ బాలీవుడ్ స్టార్స్ నాపై ఎంతో వివక్షత చూపించారు.. ఆవేదన వ్యక్తం చేసిన సన్నీలియోన్?

Sunny Leone: బాలీవుడ్ ఇండస్ట్రీలో శృంగార తారగా పేరు సంపాదించుకున్న సన్నీ లియోన్ గురించి తెలియని వారు ఉండరు. ఒకప్పుడు పోర్న్ స్టార్ గా పేరు సంపాదించుకున్న ఈమె ఇప్పుడు వాటన్నింటికి దూరంగా ఉండి ఎంతో బుద్ధిగా సినిమాలు చేసుకుంటూ మరోవైపు కుటుంబాన్ని చూసుకుంటూ ఉన్నారు. ఇలా పలు సినిమాలతో ప్రస్తుతం సన్నీ లియోన్ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సన్నీలియోన్ కెరియర్ మొదట్లో ఇండస్ట్రీలో తన పట్ల చూపిన వివక్షత గురించి చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు.తాను బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లో తన పట్ల చాలామంది ఎంతో వివక్షత చూపించారని ఈమె పేర్కొన్నారు. ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొందరు స్టార్ హీరోలు అలాగే, పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు తనకు అవకాశం ఇవ్వడానికి ఏమాత్రం ఇష్టపడే వాళ్ళు కాదని ఈమె పేర్కొన్నారు.

ఇకపోతే ఇప్పటికీ కొందరు బాలీవుడ్ స్టార్స్ తనతో కలిసి నటించే అవకాశం వస్తే వెనకడుగు వేస్తున్నారని ఈమె ఆవేదన చెందారు.అయితే ఈ విషయం గురించి తాను ఎక్కువగా ఆలోచించి బాధపడనని ఏదో ఒక రోజు తప్పకుండా వాళ్లతో కలిసి నటించే అవకాశం తనకి వస్తుందంటూ ఈమె ధీమా వ్యక్తం చేశారు.

Sunny Leone: ఇప్పటికీ నాకు అవకాశాలు ఇవ్వరు..

ఇకపోతే ఈమె కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తెలుగు తమిళ భాషలలో కూడా పలు సినిమాలలో నటించారు. ప్రస్తుతం మంచు విష్ణు నటిస్తున్నటువంటి జిన్నా సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇకపోతే ఈ మధ్యకాలంలో ఈమె మంచి విష్ణు తో కలిసి చేసే వీడియోలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago