Chiranjeevi: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాల హవా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు నటించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సినిమాలను తిరిగి వారి పుట్టినరోజు సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలు అందరి సినిమాలు కూడా తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
ఒకప్పుడు అట్టర్ ఫ్లాప్ అయినటువంటి సినిమాలు కూడా తిరిగి విడుదలవుతూ మంచి కలెక్షన్లను రాబడుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇలా తెలుగు హీరోల సినిమాలు మాత్రమే కాకుండా తమిళ హీరోలు నటించి డబ్ చేసినటువంటి సినిమాలను కూడా తిరిగి విడుదల చేయటం విశేషం. ఇలా పలు సినిమాలు రీ రిలీజ్ అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.
ఇకపోతే ఆగస్టు 22వ తేదీ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కావడంతో ఆయన పుట్టినరోజు సందర్భంగా తన కుమారుడు చరణ్ నటించిన నాయక్ సినిమాని తిరిగి విడుదల చేయడానికి మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా ఈ సినిమా రీ రిలీజ్ కి సంబంధించిన పోస్టర్ కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇకపోతే ఈ సినిమా 2013 వ సంవత్సరంలో డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో మొదటిసారి రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో నటించారు. ఇలా అప్పట్లో ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే చిరంజీవి పుట్టినరోజు కావడంతో తన కుమారుడి సినిమాని తిరిగి విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆమెగా అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…