Dance Master Poppy : ఈటీవీ లో ఇప్పటికీ మంచి రేటింగ్స్ తో దూసుకుపోతున్న డాన్స్ షో ఢీ. ఇందులో ఎంతోమంది కాంటెస్టెంట్స్ గా వచ్చి ప్రస్తుతం డాన్స్ మాస్టర్స్ గా సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు అందుకున్నారు. అలాంటి వారిలో లేడీ డాన్స్ మాస్టర్ పప్పీ ఒకరు. తమిళనాడు కి చెందిన పప్పీ మాస్టర్ ఢీ డాంస్ షోలో ఒక కంటెస్టెంట్ గా ప్రయాణం మొదలు పెట్టి నేడు తమిళ్ లో మంచి కొరియోగ్రాఫర్ గా స్థిరపడ్డారు. ఇక అప్పట్లో షోలో శేఖర్ మాస్టర్ తో ఉన్న అనుబంధం గురించి అలాగే తన కెరీర్ గురించి వివరించారు.
శేఖర్ మాస్టర్ కి నేనంటే భయం…
చెన్నై కి చెందిన పప్పీ మాస్టర్ తండ్రి నిర్మాత అలాగే తల్లి డాన్స్ మాస్టర్. చిన్నప్పటి నుండి డాన్స్ మీద ఆసక్తితో ఇటువైపు వచ్చారు. అలా డాన్స్ షో ఢీ లో పాల్గొన్నపుడు ఫైనల్ వరకు వచ్చిన పప్పీ మాస్టర్ కి పోటీగా శేఖర్ మాస్టర్ ఫైనల్స్ కి వచ్చారు. శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీలో క్రియేటివిటీ ఉంటుంది అలాగే నా కోరియోగ్రఫీ లో స్టైల్ ఉంటుంది అంటూ చెప్పిన ఆమె ఫైనల్స్ లో ఇద్దరికీ టఫ్ అయిందంటూ చెప్పారు. గెస్ట్ గా వచ్చిన ప్రభాస్ అలాగే మిగిలిన వాళ్ళు అందరూ టెన్షన్ పడ్డారు ఎవరు గెలుస్తారు అని అంత టఫ్ గా పెర్ఫార్మన్స్ ఇద్దరిది ఉంది.
చాలా చిన్న తేడాతో శేఖర్ మాస్టర్ గెలిచాడు, నేను రన్నర్ అప్ గా నిలబడ్డాను. ఆరోజు చాలా బాధపడ్డాను అంటూ చెప్పారు. ఇక శేఖర్ మాస్టర్ ప్రతి ఎపిసోడ్ అప్పుడు నీ డాన్స్ అంటే నాకు భయం అంటూ చెప్పేవాడట. అలాగే ఫైనల్ ఢీ టైటిల్ కొట్టినపుడు కూడా నువ్వే విన్నర్ అంటూ శేఖర్ మాస్టర్ చెప్పడం సంతోషంగా అనిపించిందంటూ చెప్పారు. తెలుగు ఇండస్ట్రీలో అసూయ ఉండదని ఒకరినొకరు ప్రోత్సాహిస్తారు అంటూ అది ఇక్కడ నాకు బాగా నచ్చుతుందని తెలిపారు.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…