Director Geetha Krishna : ఫిబ్రవరి 2 న అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతు దిగ్గజ డైరెక్టర్ కళా తపస్వి కే విశ్వనాథ్ గారు 92 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. ఆయన తెలుగులో ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలను తీసి ప్రేక్షకులను అలరించారు. ఆయన తీసిన మొదటి సినిమా నుండే అవార్డులు సత్కారాలు ఆయనకు క్యూ కట్టాయి. ఇక ఆయన తీసిన ఎన్నో చిత్రాల్లో భారతీయ సంస్కృతి అలాగే కళలను ముందు తరాల వారికి అందించారు. ప్రతి సినిమాలోనూ ఆయన చెప్పాలనుకున్న కథతో మిళితంగా సమాజానికి ఏదో ఒక సందేశం ఉంటుంది. ఇక ఆయన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ఆయన శిష్యుడు డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఆయనను తలుచుకుంటూ ఆయన సినిమా జీవిత విశేషాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
నాగేశ్వరావు గారికి, విశ్వనాథ్ గారికి గొడవ…
విశ్వనాథ్ గారు మొదట సౌండ్ రికార్డర్ గా పని మొదలు పెట్టి ఆపైన అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆదుర్తి సుబ్బరావు గారి వద్ద పనిచేసారు. అయితే నాగేశ్వరావు గారి సినిమాకు సౌండ్ రికార్డర్ గా పనిచేస్తున్న సమయంలోనే ఆయన డైలాగు చెప్పిన విధానంలో తప్పు ఉందని నాగేశ్వరావు గారికి చెప్పడంతో ఆయన దృష్టిలో పడ్డారు. అలా అయన సునిశిత పరిశీలన నచ్చి నాగేశ్వరావు గారు ఆదుర్తి గారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయమని చెప్పారంటూ గీతా కృష్ణ అభిప్రాయపడ్డారు.
ఇక విశ్వనాథ్ గారి మొదటి సినిమా ఆత్మ గౌరవం కూడా నాగేశ్వరావు గారితో చేసారు. మూగమనసులు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసినపుడే నాగేశ్వరావు గారు విశ్వనాథ్ గారికి సినిమా ఆఫర్ ఇచ్చారట. అలా మొదటి డైరెక్షన్ నాగేశ్వరావు గారితో చేసిన ఆ తరువాత ఆయనతో కొనసాగాలేదు వరుసగా ఎన్టీఆర్, శోభన్ బాబు, కృష్ణ వంటి హీరోలతో ఆయన సినిమాలను తీశారు. నాగేశ్వరావు గారికి, విశ్వనాథ్ గారికి మధ్య చిన్న మనస్పర్తలు కారణంగా వారిద్దరూ ఆత్మ గౌరవం సినిమా తరువాత కలిసి పనిచేయలేదు. మళ్ళీ అన్ని మర్చిపోయి ‘సూత్రాధారులు’ సినిమాకు పనిచేసారంటూ డైరెక్టర్ గీతా కృష్ణ ఆయన గురువుగారైన విశ్వనాథ్ గురించి తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…