Director Nandam Harichandhra Rao : చంద్రబాబు నాయుడు మినిస్ట్రీ పోయాకే ఎన్టీఆర్ సొంత పార్టీ ఆలోచన చేసారు…: డైరెక్టర్ నందం హరిశ్చంద్ర రావు

Director Nandam Harichandhra Rao : దాసరి గారి శిష్యుడు గా తెలుగు ఇండస్ట్రీలో డైరెక్టర్ గా వచ్చిన వారిలో నందం హరిశ్చంద్ర రావు ఒకరు. 1973లో ఇండస్ట్రీలోకి చాలా యాదృచ్చికంగా వచ్చారు. తండ్రి స్నేహితుడైన ఎంకే మౌళి అనే ఆయన అప్పటికే నిర్మాతగా తెలుగులో ‘స్వర్గం నరకం’ సినిమా తీశారు. ఆయన దాసరి గారికి బాగా సన్నిహితంగా ఉండేవారు. బావ గారు చెల్లి అంటూ దాసరి గారిని ఆయన భార్యను పిలిచేవారట మౌళి గారు. అలా ఆయన ద్వారా దాసరి వద్దకు చేరానని హరిశ్చంద్ర గారు వివరించారు. అప్పటికి దాసరి గారు ‘తాత మనవడు’ సినిమా మంచి హిట్ తో ఉండగా ఆయన నెక్స్ట్ సినిమా ‘సంసార సాగరం’ సినిమాకు అసిస్టెంట్ గా కెరీర్ మొదలు పెట్టిన హరిశ్చంద్ర గారు ఇక అప్పటి నుండి దాసరి గారి వెన్నంటే ఉన్న శిష్యులలో ఒకరు.

చంద్రబాబు మినిస్ట్రీ వల్లే టీడీపీ పార్టీ…

ఎన్టీఆర్ గారు దాసరి గారితో ‘బొబ్బిలి పులి’ సినిమా చేస్తున్న సమయంలో చంద్రబాబు గారి మంత్రి పదవి అప్పటి సీఎం భవనం వెంకట్రావ్ గారు తీసేసారు. అసలే షూటింగ్ చాలా లేట్ అవుతోందనే టెన్షన్ లో ఉండగా ఎన్టీఆర్ గారు చంద్రబాబు మంత్రి పదవి పాయిందనే వార్త తెలిసీ హైదరాబాద్ వెళ్లాలంటూ ఒకరోజు కావాలని అడిగారు.

ఇక వెళ్లి వచ్చిన తరువాత ఆయన మాట్లాడుతూ అసలు మనల్ని ఏమనుకుంటున్నారు వీళ్ళు. మనల్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు అంటూ సీఎం గురించి మాట్లాడుతున్నారు. ఏదోకటి పరిష్కారం చూడాలి అంటూ అన్నారు. అదే సంఘటన వలన ఎన్టీఆర్ గారు సొంత పార్టీ టీడీపీ పెట్టుకోడానికి బీజం పడింది అంటూ అప్పటి సంగతులను వివరించారు.