Kangana Ranaut: బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి నటి కంగనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తరచూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచే ఈమె తనకు తోచిన విషయాన్ని ముక్కుసూటిగా చెబుతూ పలు వివాదాలకు కారణం అవుతూ ఉంటారు. ముఖ్యంగా ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో నెపోకిడ్స్ గురించి తరచూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు.
ఇక ఈమెకు ఏదైనా తప్పుగా అనిపించింది అంటే మొహమాటం లేకుండా ఆ విషయాన్ని బహిరంగంగా చెబుతూ ఉంటారు. అలాగే ఏదైనా మంచి అనిపిస్తే ఆ మంచిని కూడా చాలా ప్రేమగా చెబుతూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇలా తరచూ ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలిచే ఈమె ఈ మధ్యకాలంలో బాలీవుడ్ సినిమాల కన్నా సౌత్ సినిమాలపైనే ఆసక్తి చూపుతున్నారు.
ప్రస్తుతం కంగనా చంద్రముఖి సినిమా సీక్వెల్ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే నటి జ్యోతిక గురించి కంగనా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.చంద్రముఖి సినిమాలో జ్యోతిక చంద్రముఖి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించిన సంగతి తెలిసిందే అయితే ఈ సినిమా సీక్వెల్ చిత్రంలో అదే పాత్రలో నటించడానికి జ్యోతికను అప్రోచ్ కావడంతో ఆమె ఇందులో నటించడానికి నిరాకరించింది దాంతో ఈ అవకాశం కంగనాకు వెళ్ళింది.
ఈ క్రమంలోనే కంగన ఈ పాత్ర గురించి మాట్లాడుతూ… చంద్రముఖి సినిమాలో జ్యోతిక నటన ఎంతో అద్భుతమని తన మాదిరిగా నటించడం ఎవరి వల్ల కాదు. జ్యోతిక స్థాయిలో నటించే అంత సీన్ నాకు లేదని,జ్యోతిక రేంజ్ లో నన్ను కనుక కంపేర్ చేసి చూస్తే నిరాశ తప్పదు అంటూ ఈ సందర్భంగా జ్యోతిక నటన గురించి కంగనా ఎంతో గొప్పగా చెబుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…