Senior Comedian Pakiza : తమిళ నటి వాసుకి అంటే ఎవరూ గుర్తు పట్టకపోవచ్చు కానీ తెలుగులో పాకీజా అంటే మాత్రం అందరూ గుర్తు పడతారు. బ్రహ్మానందం, పాకీజా కామెడి 90 దశకంలో వచ్చిన ఎన్నో సినిమాలలో సూపర్ హిట్ అయింది. తెలుగులో దాదాపు 100 కి పైగా సినిమాల్లో నటించిన పాకీజా సినిమా అవకాశాలు తగ్గాక తెలుగు తెరకు దూరమైంది, దాదాపు కనిపించలేదు. అయితే చాలా కాలం తరువాత చెన్నైలో తెలుగు మీడియా ప్రతినిధికి కనిపించింది పాకీజా. ప్రస్తుతం ఆమె ఆర్థిక ఇబ్బందులతో తిండి గడవడం కూడా కష్టంగా మారి ఇబ్బందులు పడుతు ఒక యూట్యూబ్ ఛానెల్ వ్యక్తి కంట పడింది. ఇక తన కష్టాలను కన్నీళ్లను చూసిన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆమెను ఆదుకుంది.
చిరంజీవి వల్లే ఈరోజు బ్రతికాను…
పాకిజా ప్రస్తుతం హైదరాబాద్ లో సినిమాలలో నటిస్తూ మరియు జబర్దస్త్ వంటి కామెడీ షోస్ లో చేస్తూ బిజీగా మారారు. ఒక్క పూట గడవక ఇబ్బంది పడుతున్న సమయంలో తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీని సహాయం చేయమని అడిగినా ఎవరూ చేయలేదని, అయితే యూట్యూబ్ ఛానెల్ ద్వారా నా పరిస్థితి తెలిసీ తెలుగు ఇండస్ట్రీ ఆదుకుందని ముఖ్యంగా మెగా ఫ్యామిలీ ఆదుకుందని చెప్పారు. చిరంజీవి గారు లక్ష రూపాయలు డబ్బు పంపారని అలాగే నాగబాబు, పవన్ కళ్యాణ్ కూడా స్పందించి సహాయం చేసారు, సినిమాల్లో అవకాశాలు ఇప్పించారని చెప్పారు.
ఇక మోహనబాబు గారికి మెసెజ్ చేస్తే ఆయన స్పందించి ఇండియాలో లేను వచ్చాక మనం కలిసి మాట్లాడుదాం అని చెప్పారంటూ పాకిజా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఇక తనకు మొదటి నుండి ఫ్రెండ్ గా ఉన్న జయలలిత కూడా సహాయం చేసినదంటూ చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటున్నట్లు తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…