Disco Shanti : డిస్కో శాంతి….1990 లలో ఈ పేరు వినని సినీ ప్రేక్షకులు వుండరు. మొదట తమిళ్ సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన డిస్కో శాంతి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ తో పాటు ఒడియా లో కూడా నటించింది. ఈమె సినీ ప్రస్థానంలో మొత్తం 900 కు పైగా సినిమాలలో నటించింది. ఐటమ్ పాటలు మాత్రమే కాకుండా అతిథి పాత్రలో, కామెడీ పాత్రలో కూడా అభిమానులను మెప్పించింది. వెంకటేష్ తప్పితే మిగతా అందరి హీరోల సరసనా నటించింది. 1996 లో శ్రీహరిని వివాహం చేసికున్నారు. పెళ్లి తరువాత సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. వీరికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె. కాగా కుమార్తె నాలుగు నెలల వయసులో చనిపోవడంతో పాప పేరు మీద అక్షర ఫౌండేషన్ ని నడుపుతున్నారు.
చెప్పుతో కొట్టె సీన్ ఉండటంతో ఆ సినిమా వద్దనుకున్నా…….
అక్షర ఫౌండేషన్ లో భాగంగా మేడ్చల్ లోని కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే శ్రీహరి మరణానంతరం డిస్కో శాంతి చాలా క్రుంగిపోయారు. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. శ్రీహరి మరణం తరువాత కోలుకోవడానికి సమయం పట్టిందని. ఆయన చనిపోయి 9 సంవత్సరాలు అవుతున్న ఇప్పటికి పూర్తిగా కోలుకోలేదని చెప్పారు. ఆయన మరణం తరువాత తాగుడుకు ఎక్కువగా బానిస అయ్యానని కానీ ఇప్పుడు పిల్లల కోసం పూర్తిగా మనుకున్నాను అని చెప్పుకొచ్చారు.
ఎన్టీఆర్ తో అనుబంధం గురించి చెబుతూ…. మా కుటుంబంతో చాలా బాగా ఉంటారని, ఆయనను బాబాయ్ అని పిలిచేవారని చెప్పుకొచ్చారు. ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రస్థావించగా సినిమా చాలాబాగుంది చరణ్ కన్నా ఎన్టీఆర్ బాగా చేసాడు అని చెప్పింది. ఇక కృష్ణ గారి ఫ్యామిలీతో సినిమాల గురించి ప్రస్థావించగా…. మహేష్ బాబుతో ఒక అవకాశం వచ్చిన్నింది, కానీ చెప్పుతో కొట్టె సన్నివేశం ఉందన్నారు నేను చేయను, నన్ను ఎవరైనా అలా కొడితే తిరిగి నేను కూడా కొడతాను, ఎంత పెద్ద హీరో అయినా నేను మాత్రం అలా చేయను అని ఆ సినిమా వదులుకున్నాను అని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…