Featured

Manmadhudu Movie : త్రివిక్రమ్ కథ చెప్పడానికి వెళ్తే కథ మొత్తం విని నాగ్ సైలెన్స్…..ముందు తరుణ్ తో అనుకోని నాగార్జునకి ఎందుకు షిఫ్ట్ అయ్యారు…..

Manmadhudu Movie : మన్మధుడు సినిమా…. ఈ సినిమా ఇష్టపడని సినీ ప్రేక్షకులు వుండరు అంటే అతిశయోక్తి కాదు. 2002 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కె. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నాగార్జున హీరోగా, సోనాలి బింద్రే, అన్షు హీరోయిన్లుగా చేశారు. సినిమా విడుదల అయ్యి ఇన్నేళ్లు అవుతున్న ఇప్పటికి ఈ సినిమా టీవీలో వచ్చింది అంటే మిస్ అవ్వకుండా చూస్తారు. ఇక ఈ సినిమాలో పారిస్ లో బ్రహ్మానందంతో వున్న సీన్లు పొట్ట చెక్కలు అయ్యేలా నవ్విస్థాయి. కామెడీతో పాటు ఎమోషనల్ డైలాగులు కూడా ఆకట్టుకున్నాయి. ఇంతటి విజయ వంతమైన సినిమా వెనుక చాలా కథనే వుంది.

మొదట మన్మధుడు…హి హేట్స్ ఉమెన్..అనగానే ఆశ్చర్యపోయిన నాగ్…..

స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్ వంటి సినిమాలతో మంచి ఫామ్ లో వున్నారు దర్శకుడు కె. విజయ్ భాస్కర్, రచయిత త్రివిక్రమ్. అయితే త్రివిక్రమ్ కు కూడా దర్శత్వం చేయాలనీ వుంది నా దగ్గర రెండు కథలు వున్నాయి ఏమ్ చేయాలో అర్థం అవ్వట్లేదు అని విజయ్ ని అడుగగా… అందుకు విజయ్ భాస్కర్ నవ్వి ఇంత చిన్న విషయానికి ఎందుకు అంత ఆలోచిస్తున్నావు, నువ్వే నువ్వే కథను నువ్వు తరుణ్ తో తీయి. తరుణ్ నీ డైలాగులకు అలవాటు పడ్డాడు అని చెప్పి, రెండవది నేను తీస్తాను, నీ కథ అంటే ఎవరైనా సినిమా తీయడానికి ఒప్పుకుంటారు నమ్మకం వుంది. కథ చెప్పి ఈ సినిమాకు మన్మధుడు అని టైటిల్ అనుకుంటున్నాను అని చెప్పాడు త్రివిక్రమ్.

అయితే మన టాలీవుడ్లో మన్మధుడు అంటే నాగార్జున గారే, ఆయన ఒప్పుకుంటాడో లేదో అన్న అనుమానంతో ఇంటికి వెళ్లగా…. నాగార్జున ఫ్రీగా ఉండటం కథ వినడం జరిగిందట. త్రివిక్రమ్ కథ చెబుతూ… ఈ సినిమా టైటిల్ మన్మధుడు బట్ హి హేట్ ఉమెన్ అని చెప్పగా నాగ్ సైలెంట్ గ్స్ ఉండిపోయాడు. తరువాత కథ మొత్తం విన్నాక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంటే కాకుండా నిర్మాత కోసం టెన్షన్ పడకండి ఈ సినిమాను అన్నపూర్ణ ప్రొడక్షన్ బ్యానర్లో నేనే నిర్మిస్తాను అని చెప్పారట. త్రివిక్రమ్ తరుణ్ తో నువ్వే నువ్వే సినిమా, విజయ్ నాగార్జునతో మన్మధుడు సినిమా తీసారు.అలా ఈ సినిమా 2002 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Bhargavi

Recent Posts

సముద్ర మధ్యలో హంటా వైరస్ కలకలం.. అప్రమత్తమైన WHO, ప్రత్యేక ఆపరేషన్‌తో ప్రయాణికుల రక్షణ

అంతర్జాతీయ సముద్ర జలాల్లో ప్రయాణిస్తున్న ఓ క్రూయిజ్ నౌకలో హంటా వైరస్ అనుమానిత కేసులు వెలుగులోకి రావడం కలకలం రేపింది.…

10 minutes ago

విజయ్ సీఎం ఆశలకు గవర్నర్ బ్రేక్.. తమిళనాడులో రాజకీయ టెన్షన్!

తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం ఉత్కంఠభరితంగా మారాయి. ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకు సాగుతున్న టీవీకే నేత విజయ్‌కు గవర్నర్ రాజేంద్ర…

43 minutes ago

వేసవిలో ఈ డ్రింక్ తాగితే చాలు.. డీహైడ్రేషన్ నుంచి బరువు తగ్గే వరకు ఎన్నో ప్రయోజనాలు!

ఎండలు తీవ్రంగా పెరుగుతున్న వేళ శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ సమయంలో నీటితో పాటు ఆరోగ్యానికి మేలు…

4 hours ago

ఐస్ క్యూబ్స్ వాసనతో ఇబ్బందా? కిచెన్‌లో ఉన్న వాటితోనే సింపుల్ సొల్యూషన్!

ఎండాకాలం వచ్చిందంటే ఇంట్లో ఫ్రిజ్ వినియోగం మరింత పెరుగుతుంది. ముఖ్యంగా చల్లని నీరు, ఐస్ క్యూబ్స్ లేకుండా చాలామందికి రోజు…

4 hours ago

విఘ్నాలను తొలగించే మహా గణనాథుడు.. భక్తులతో కిటకిటలాడుతున్న తెలంగాణ క్షేత్రాలు!

విఘ్నాలను తొలగించే దేవుడిగా గణపతికి హిందూ సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉంది. ఏ శుభకార్యమైనా వినాయకుడి పూజతోనే ప్రారంభించడం ఆనవాయితీ.…

4 hours ago

సీతారాముల జ్ఞాపకాలతో నిండిన పవిత్ర క్షేత్రాలు.. ఒక్కసారి దర్శిస్తే చాలు!

భారతీయ సంస్కృతిలో రామాయణానికి ప్రత్యేక స్థానం ఉంది. శ్రీరాముడి జీవితం ధర్మానికి ప్రతీకగా భావిస్తారు. త్రేతాయుగంలో జరిగిన ఈ మహాగాథతో…

5 hours ago