Pandanti Kaapuram Movie : సూపర్ స్టార్ కృష్ణ సినీ చరిత్రలో తన 60వ సినిమాగా వచ్చిన మోసగాళ్లకు మోసగాడు సినిమా గురించి అది సాధించిన విజయం గురించి అందరికి తెలిసిందే. అయితే మోసగాళ్లకు మోసగాడు సినిమాకి మహిళా ప్రేక్షకులు అంతగా రాలేదని వారిని ఆకట్టుకోవడానికి ఒక కుటుంబ కథా చిత్రం తీయాలని తమ్ముళ్ళతో సంప్రదించి బాలీవుడ్ లో రాకేష్ ఖన్నా హీరోగా వచ్చిన దో రాస్తే సినిమా రీమేక్ హక్కుల కోసం ప్రయత్నించ్చారట. కానీ అది ఫలించలేదు, తరువాత కొన్ని సినిమాలు తీసిన తరువాత నటుడు ప్రభాకర్ రెడ్డి గారు దో రాస్తే, ఇంగ్లీష్ మూవీ ది విజిట్ సినిమాలు కలిపి కథా తయారు చేయగా సూపర్ స్టార్ కృష్ణ ఒప్పుకోవడంతో పండంటి కాపురం సినిమా మొదలు అయ్యింది.
పండంటి కాపురం సినిమాకు పోటీగా భానుమతి మరో ప్రయత్నం……..
సినిమా కథ గురించి పాత్రలు గురించి చర్చిస్తుండగా కృష్ణ తమ్ముడు హనుమంతరావు సినిమాకు పండంటి కాపురం టైటిల్ చెప్పగా అందరికి నచ్చడంతో దానిని పెట్టారు. అయితే సినిమాలు నలిగి అన్నదమ్ములుగా ఎస్వి రంగారావు గారు, గుమ్మడి, ప్రభాకర్ రెడ్డి, కృష్ణ లుగా అనుకోగా, సినిమాలో రాణి మాలిని దేవి పాత్ర కోసం భానుమతి గారిని సంప్రదించారట. భానుమతికి కూడా కథా నచ్చడం, ప్రస్తుతం చేస్తున్న సినిమా పూర్తవ్వగానే పండంటి కాపురం సినిమాకు డేట్లు ఇస్తానని చెప్పడంతో అందరి డేట్లు తీసుకున్నాక ఇపుడు ఆమె కోసం ఎదురుచూస్తే ఆలస్యం అవుతుందని భావించి ఆ పాత్రకు జమున గారిని తీసుకున్నారట.
అయితే దీనికి కోపం తెచ్చుకున్న భానుమతి గారు ఇంగ్లీష్ సినిమా ది విజిట్ అదారంగా ఈ సినిమా తీయబోతున్నారు కాబట్టి ఆ సినిమాని నేను తిస్తె బాగుంటుంది అన్న ఆలోచనతో గుమ్మడి గారిని సంప్రదించిందట. అయితే గుమ్మడి గారు పండంటి కాపురం సినిమా చేస్తుందటంతో అక్కడ ఈ విషయం చెప్పగా అప్పటికే భానుమతి కి ఎస్వి రంగారావు గారికి పడకపోవడతో అలా ఎలా చేస్తారు అని ఆవేశం చెందారు. అయితే ఈ సినిమాని కృష్ణ గారు అందరికి సహకారంతో ముఖ్యంగా ఎస్వి రంగారావు గారి సహకారంతో అనుకున్నదానికంటే ముందుగానే పూర్తి చేసి విడుదల చేయడం అది ఘన విజయం సాదించడం జరిగింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…