సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇద్దరు కుమారులు ఈ విషయాలు మీకు తెలుసా..? తండ్రికి తగ్గ తనయులు !

తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి క్యాన్సర్ తో బాధపడుతూ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. సుమారు 3000కు పైగా పాటలు రాశాడు. ఎన్నో అవార్డులను అందుకున్నాడు. ఎన్నో మధురమైన పాటలు అతడి చేతినుంచి జాలు వారాయి. అతడి మరణం సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతిని కలుగజేసింది.

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి భౌతికకాయానికి నివాళులర్పించారు సినీ ప్రముఖులు.. ఫిలింఛాంబర్‌లో ఆయన పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి చిరు, బాలయ్య, వెంకటేష్ శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మీడియాతో వాళ్లు మాట్లాడుతూ సీతారామశాస్త్రి గారితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఇక ఆయన మరణం సమయంలో ఆయనకు 66 సంవత్సరాలు.

సిరివెన్నెలకు భార్య పద్మావతి, ఇద్దరు కుమారులు రాజా, యోగేష్ ఉన్నారు. తండ్రి స్పూర్తితో ఇద్దరూ కూడా సినీరంగ ప్రవేశం చేశారు. అది కూడా ఒకరు సంగీతం, మరొకరు నటన వైపు కావడం విశేషం. ఇక అతడి పెద్ద కొడుకు యోగేశ్వర్ శర్మ.. సంగీత దర్శకుడిగా ‘కుదిరితే కప్పు కాఫీ’ సినిమాతో పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో వరుణ్ సందేశ్ హీరోగా చేశాడు.

ఇక తర్వాత ఎన్నో చిత్రాలకు సంగీతదర్శకుడిగా పని చేశాడు. అందులో ‘రంగు’ అనే సినిమా కూడా ఉంది. ఇక చిన్నబ్బాయి గురించి చెప్పుకుంటే.. అతడు కేక సినిమాతో హీరోగా పరిచయం అయ్యడు. తర్వాత ఎవడు సినిమాలో నెగెటివ్ రోల్ చేశాడు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇలా అతడి చిన్న కుమారుడు రాజా.. ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఫిదాలో వరుణ్ తేజ్ కు అన్నగా నటించింది రాజానే.