ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా మూవీ విజయవంతం కావడంతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. అయితే అతడికి ప్రస్తుతం 61 ఏళ్లు. బాలయ్య చిన్న తనంలో ఉన్న ఎనర్జీతో ఇప్పటికీ సినిమాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో నిన్న (డిసెంబర్ 2) ఆయన నటించిన ‘అఖండ’ సినిమా గ్రాండ్ గా విడుదలైంది.
ఈ సినిమా ఫస్ట్ షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో పాటు కరోనా విపత్కర పరిస్థితుల తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకురావడానికి ఇలాంటి సినిమాకి పునాది వేసినందుకు ఆనందంగా ఉందంటూ చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. ఇదే ఆనందంతో ప్రెస్ మీట్ లో అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ బాలయ్యబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటారని .. అదే తెలుగు ప్రేక్షకుల ప్రత్యేకత అని బాలకృష్ణ అన్నారు. ఫస్ట్ షోతోనే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాను హైదరాబాద్ లోని ఏఎంబీ మాల్ లో అభిమానులతో వీక్షించారు. అయితే ఇంటర్వెల్ సమయంలో కొందరు పిల్లలు తన వద్దకు వచ్చి అంకుల్ సినిమా అద్భుతంగా ఉందని చెప్పారని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.
అంతా బాగానే ఉంది గానీ.. నన్ను అంకుల్ అనడం నాకు నచ్చలేదు అంటూ.. సరదాగా వారితో చెప్పినట్లు తెలిపాడు. అఖండ సినిమా కోసం అందరూ కష్టపడ్డారని.. ఈ సినిమాలో ఎన్నో నిజాలు చూపించారని బాలకృష్ణ అన్నారు. ఇది తమ సినిమా విజయం మాత్రమే కాదని.. సినీ పరిశ్రమ సాధించిన విజయమని అన్నారు. షూటింగ్ సమయంలో ఆర్టిస్టులందరూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. అందరూ దృఢ సంకల్పంతో పని చేశారన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…