మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. జంతు ప్రేమికురాలు అయిన ఆమె పలు పక్షులు, జంతువులు, పోషకాహారాల గురించి.. ఆయుర్వేద పద్ధతుల్లో వైద్యం గురంచి అనేక రకాల చిట్కాలు, సలహాలను వీడియో రూపంలో అందిస్తుంది. ఈ వీడియోలను చాలా మంది చూస్తుంటారు.
అంతే కాదు ఇవి తమకు ఎతో ఉపయోగపడతాయని కూడా చాలామంది ఆమెను ప్రశంసించారు కూడా. ఉపాసన ఎక్కువగా మీడియాతో ఇంటరాక్ట్ అవ్వదు. సోషల్ మీడియా ఖాతాల ద్వారా తనకు ఏది అనిపించినా స్పందిస్తుంది. కొత్త విషయాలకు సంబంధించి ఏం విషయం తెలిసినా ఆమె షేర్ చేస్తుంది. నెగెటివ్ కామెంట్లకు కూడా గట్టిగానే ఇచ్చి పడేస్తుంది. ఈ క్రమంలో ఆమె ఇంటర్వ్యూలో ఇటీవల ఆసక్తికరమైన విషయాలను వెల్లడించిన విషయం తెలిసిందే.
పిల్లలు ఎప్పుడు పుడతారు? అనే ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు. అది తన వ్యక్తిగతమని.. దాని గురించి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదని ఆమె అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.. తనకు ట్రాన్స్‌జెండర్ ఫ్రెండ్ ఉన్నాడని ఉపాసన ఆ ఇంటర్వ్యూలో చెప్పింది.
తాజాగా తన లింగమార్పిడి స్నేహితుడితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఉపాసన కూడా వాళ్ల కమ్యూనిటీ గురించి గొప్పగా మాట్లాడింది.
ఇక ఉపాసన ఇంట్లో ఆమె సోదరి అనుష్ పాల పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రి వెడ్డింగ్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియా వేదికగా ట్రాన్స్జెండర్ తో కలిసి దిగిన ఫోటో ని షేర్ చేస్తూ వారి గురించి ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇక ఈ పెళ్లి వేడుకలకు ట్రాన్స్ జెండర్లను ఆహ్వానించినట్టు కనిపిస్తోంది. మరో విషయం ఏంటంటే.. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన యానీమాస్టార్ పెళ్లి వేడుకలో ఒక మ్యూజిక్ ఈవెంట్ కోసం రిహార్సల్స్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉపాసన చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…