బిగ్ బాస్ హౌస్ లో యూట్యూబర్స్ గా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న సిరి, షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బయట ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వీరు మంచి ఫ్రెండ్స్ గా ఉంటూ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన అప్పటి నుంచి వీరిద్దరూ ఎంతో క్లోజ్ గా మూవ్ అవుతూ ఉండడంతో వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
ఇకపోతే ఈ జంట నిత్యం ఒకరినొకరు అంటి పెట్టుకొని తరుచు హగ్గులు, ముద్దులతో రచ్చ చేశారు. ఈ క్రమంలోనే వీరి పేరెంట్స్ వీరిని గట్టిగా మందలించారు. ఇలా వారి తల్లి గారు వీరిని మందలించినప్పటికి వీరు మాత్రం పట్టించుకోకుండా హౌస్ లో హాగ్గులతో రెచ్చిపోతున్నారు. ఇక తాజాగా బిగ్ బాస్ నిర్వహించిన టికెట్ టు ఫినాలేలో భాగంగా సిరి గాయపడటంతో షణ్ముఖ్ దగ్గరుండి ఆమెకు సేవలు చేస్తున్నారు. ఆమె నడవలేని పరిస్థితిలో ఉంటే తనే ఎత్తుకొని లోపలికి తీసుకెళ్లడం చేస్తున్నారు.
ఇలా తనకు బాగా లేకపోతే షణ్ముక్ తనకు హగ్ ఇవ్వాలని డిమాండ్ చేసింది. తను హగ్ ఇవ్వకపోతే తను టాబ్లెట్స్ వేసుకోనని బ్లాక్ మెయిల్ చేయడంతో షణ్ముక్ కెమెరాల వైపు చూస్తూ ఆంటీ ఇది కేవలం ఫ్రెండ్షిప్ హగ్ మాత్రమే అంటూ తనని హగ్ చేసుకున్నాడు. ఇలా హగ్ చేసుకున్న తర్వాత సిరి తనకు ముద్దు కూడా పెట్టింది.
ఇలా నిత్యం వీరిద్దరూ హగ్ చేసుకుంటూ ఉండడంతో అభిమానులు ఈ సన్నివేశాలను జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా వీరిద్దరిని దారుణంగా ట్రోల్స్ చేస్తూ.. మాకేంటి ఈ తలనొప్పి అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…