బిగ్ బాస్ సీజన్ ఫైవ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ లో ఒకరైన యాంకర్ రవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రవికి బయట విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇలా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన మొదటి వారం నుంచి ప్రతి వారం నామినేషన్ లో ఉన్నటువంటి రవి ఫ్యాన్ ఫాలోయింగ్ ద్వారా అత్యధిక ఓట్లు పడటంతో ప్రతివారం సేఫ్ అవుతున్నారు.
అయితే 12వ వారంలో కూడా నామినేషన్ లో ఉన్నటువంటి రవి ఊహించని విధంగా హౌస్ నుండి ఎలిమినేట్ కావడంతో అభిమానులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు.రవి ఎలిమినేషన్ వెనుక ఏదో కుట్ర ఉందని బయట ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి రవి ఎలిమినేషన్ కావడం ఏంటి ఉద్దేశపూర్వకంగానే రవిని ఎలిమినేట్ చేశారంటూ కొందరు అన్నపూర్ణ స్టూడియో ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
రవి కూడా తాను ఎలిమినేషన్ ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని బిగ్ బాస్ కార్యక్రమంలో ఏదో జరుగుతుంది తప్పకుండా తెలుసుకుంటానని తెలిపారు. ఇకపోతే కొందరు అభిమానులు రవిని తిరిగి బిగ్ బాస్ హౌస్ లోకి పంపించాలని డిమాండ్ చేయడంతో ఈ విషయంపై బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ఆలోచన చేస్తున్నారు.
ఇక ఇక బిగ్ బాస్ కార్యక్రమం మూడు వారాలు ఉండడంతో ఇప్పుడు అతనినీ హౌస్ లోకి పంపిస్తే సమస్యలు వస్తాయా అనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే చాలా వరకు రవిని హౌస్ లోకి పంపించాలనే ఆలోచనలో నిర్వాహకులు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విషయం గురించి నిర్వాహకులు అధికారికంగా వెల్లడించకపోవడంతో రవి రీ ఎంట్రీ విషయంలో ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్‌లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…