టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాతో ఎంతో బిజీగా ఉన్నారు. పుష్ప సినిమాతో అల్లుఅర్జున్ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఈయన బుల్లితెరపై ప్రసారమౌతున్న ఢీ 13 గ్రాండ్ ఫినాలేకి ముఖ్య అతిథిగా వచ్చారు. ఇలా బుల్లితెరపై కొందరు డాన్సర్లు ఏయ్ బిడ్డ ఇది నీ అడ్డా అనే పాటకు డాన్స్ చేస్తున్న సమయంలో అల్లు అర్జున్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.
ఈ డాన్సర్స్ తో కలిపి అల్లు అర్జున్ తగ్గేదే లేదు అంటూ స్టెప్పులు వేయడంతో వేదికపై సందడి వాతావరణం నెలకొంది. ఇలా అల్లు అర్జున్ వేదికపైకి రాగానే యాంకర్ ప్రదీప్ ప్రియమణి పూర్ణను చూపిస్తూ వీరిద్దరికీ ఎంతో స్పెషాలిటీ ఉంది అంటూ చెప్పారు.ఎవరైనా డాన్స్ బాగా చేస్తే ప్రియమణి హగ్ ఇస్తారని అదే పూర్ణ అయితే ఏకంగా బుగ్గ కొరకుతారని వారి గురించి కామెంట్ చేశారు.
ఇక స్టేజ్ పై ఉన్నటువంటి హైపర్ ఆది సుడిగాలి సుధీర్ కామెడీ పంచులకు అల్లు అర్జున్ భాగం ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ క్రమంలోనే మధ్యమధ్యలో పంచు డైలాగులు వేస్తూ అల్లుఅర్జున్ అందరిని నవ్వించారు. ఈ క్రమంలోనే ప్రియమణి మాట్లాడుతూ మీతో వర్క్ చేయలేకపోయానని చాల బాధగా ఉంది అంటూ అల్లు అర్జున్ తో చెప్పారు.
అప్పుడు అల్లు అర్జున్ మాట్లాడుతూ వర్క్ చేయలేదనుకోకు ఇప్పటికీ ఛాన్సుంది అసలే సన్నబడి చాలా హాట్ గా ఉన్నారంటూ ప్రియమణిని అనడంతో అక్కడ ఉన్న వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇలా ప్రియమణి గురించి అల్లు అర్జున్ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఢీ 13 టైటిల్ ను కావ్య సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…