ప్రస్తుతం కరోనా రెండవ దశ భారతదేశంలో తీవ్రరూపం దాలుస్తోంది. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ఎంతో మంది ఆసుపత్రి ఫాలవుతున్నారు. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో మౌలిక వసతులు కొరత ఏర్పడి రోజుకు వేల సంఖ్యలో మరణిస్తున్నారు. ఈ క్రమంలోనే నిస్సహాయ స్థితిలో ఉన్న ఎంతోమందిని ఆదుకోవడం కోసం ఎంతో మంది ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ముందుకు వచ్చారు.
తాజాగా ప్రముఖ క్రిప్టోకరెన్సీ ప్లాట్ ఫాం ఎథెరియం సహా వ్యవస్థాపకులు విటాలిక్ బూటెరిన్ భారత్‌కు కరోనా విపత్తు సమయంలో తన వంతు సహాయంగా భారీ విరాళం ప్రకటించారు. దాదాపు ఒక బిలియన్ డాలర్ల విలువైన షిబా ఇను కాయిన్ లు. భారత్ కోవిడ్ రిలీఫ్ ఫండ్ కు ట్రాన్స్ఫర్ చేశారు.27 ఏళ్ల ఈ రష్యన్ కెనడియన్ ప్రోగ్రామర్ తన పబ్లిక్ వాలెట్ నుంచి 50 ట్రిలియన్ షిబా కాయిన్లను భారత్ కోవిడ్ రిలీఫ్ ఫండ్ కి బదిలీ చేశారు.
ట్రిలియన్ షిబా కాయిన్లను మాత్రమే కాకుండా 500 ఈథర్లను సైతం విరాళంగా ప్రకటించారు. వీటన్నిటి విలువ దాదాపు ఒక బిలియన్ డాలర్లు… భారత కరెన్సీ ప్రకారం ఏకంగా 7,300 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు. 27 ఏళ్ల వ్యక్తి భారత్ ఎదుర్కొంటున్న ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులలో ఇండియాకు ఈ విధమైనటువంటి సహాయం చేయడంతో భారత నెటిజన్లు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుతూ వస్తుంది. గత గడచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 2,81,386 మందికి పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. ఏప్రిల్ 20 తర్వాత కేసుల సంఖ్య గణనీయంగా తగ్గడం ఇదే ఇదే తొలిసారి. కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ వ్యాధి తీవ్రత అదేవిధంగా కొనసాగుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…