First pan Indian film in south : పాన్ ఇండియన్ సినిమాలు ఎపుడు వచ్చాయో తెలుసా.. ఒకేసారి నాలుగు భాషల్లో విడుదలైన సినిమా..!

First pan Indian film in south : పాన్ ఇండియన్ సినిమా బహుశా బాహుబలి సినిమా తరువాత ఈ పదం వాడుకలోకి వచ్చిందనుకుంటారు. ఒక ప్రాంతీయ భాషా చిత్రం ఇతర భాషలలో అది కూడా వీలైనన్ని ఎక్కువ భాషలలో సినిమాను అందుబాటులోకి తీసుకువస్తే ఆ చిత్రం పాన్ ఇండియా సినిమాగా పిలవబడుతుంది. దక్షిణాది చిత్రాలు ఉత్తరాదిన, బాలీవుడ్ చిత్రాలు సౌత్ లో రావడం కొత్త ఏమి కాదు కానీ కొత్తగా వచ్చిన ట్రెండ్ మాత్రం పాన్ ఇండియా. ఇక బాహుబలి సినిమాతో ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే అంతకుముందు ఇలాంటి పాన్ ఇండియన్ మూవీలు లేవా ఇపుడే కొత్తగా వస్తున్నాయా అంటే కాదనే చెప్పాలి. 80 దశకం 90 దశకాల్లోనే అలాంటి చిత్రాలు వచ్చాయి. అలాంటి ఒక చిత్రమే మన నాగార్జున నటించిన శాంతి క్రాంతి.

4భాషలు, ముగ్గురు హీరోలు, ఇద్దరు హీరోయిన్లు…..

శాంతి క్రాంతి సినిమాను కన్నడ హీరో మరియు దర్శకుడైనా వి రవి చంద్రన్ తీశారు. తెలుగు తమిళ, కన్నడ,హిందీ భాషలలో ఈ సినిమాను ప్లాన్ చేసారు. తెలుగులో నాగార్జున, తమిళ, హిందీభాషలలో రజినీకాంత్, కన్నడ లో రవి చంద్రన్ నటించారు. ఇక హీరోయిన్లుగా జూహి చావ్లా, ఖుష్బూ నటించారు. సినిమా ప్రారంభం అయితే బాగా సాగింది, ఆ తర్వాత షూటింగ్‌లో కూడా భారీగానే ఖర్చు పెట్టారు. సొంత నిర్మాణ సంస్థ కాబట్టి ఆ విషయంలో ఎక్కడా తగ్గలేదు రవిచంద్రన్‌.

సినిమా చాలా వరకు పూర్తయ్యాక బడ్జెట్ సమస్య వచ్చింది రవి చంద్రన్ కి ఇక ఆ సమయంలో తెలుగులో చంటి సినిమా కన్నడ వెర్షన్ రామాచారి సినిమా ద్వారా ఘన విజయం అందుకుని అందులో వచ్చిన డబ్బుతో శాంతి క్రాంతి సినిమాని పూర్తి చేసారు . ఇన్ని ఇబ్బందులు పడి పూర్తి చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. నాలుగు భాషల్లోనూ అదే పరిస్థితి. మరీ ఓవర్ గా తీసిన యాక్షన్ సన్నివేశాలు కొంపముంచాయి,నిర్మాతను నిండా ముంచాయి. ఇక ఈ సినిమాలో కేజీఎఫ్ సినిమాలో కథ చెప్పే అనంతనాగ్ విలన్ గా నటించారు. ఇలా అప్పట్లోనే పాన్ ఇండియా సినిమా వచ్చింది సౌత్ సినిమా పరిశ్రమకు ఇవేం కొత్తకాదు. కాకపోతే అప్పట్లో పాన్ ఇండియా అనే పేరు లేదు అంతే…