First pan Indian film in south : పాన్ ఇండియన్ సినిమా బహుశా బాహుబలి సినిమా తరువాత ఈ పదం వాడుకలోకి వచ్చిందనుకుంటారు. ఒక ప్రాంతీయ భాషా చిత్రం ఇతర భాషలలో అది కూడా వీలైనన్ని ఎక్కువ భాషలలో సినిమాను అందుబాటులోకి తీసుకువస్తే ఆ చిత్రం పాన్ ఇండియా సినిమాగా పిలవబడుతుంది. దక్షిణాది చిత్రాలు ఉత్తరాదిన, బాలీవుడ్ చిత్రాలు సౌత్ లో రావడం కొత్త ఏమి కాదు కానీ కొత్తగా వచ్చిన ట్రెండ్ మాత్రం పాన్ ఇండియా. ఇక బాహుబలి సినిమాతో ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే అంతకుముందు ఇలాంటి పాన్ ఇండియన్ మూవీలు లేవా ఇపుడే కొత్తగా వస్తున్నాయా అంటే కాదనే చెప్పాలి. 80 దశకం 90 దశకాల్లోనే అలాంటి చిత్రాలు వచ్చాయి. అలాంటి ఒక చిత్రమే మన నాగార్జున నటించిన శాంతి క్రాంతి.
4భాషలు, ముగ్గురు హీరోలు, ఇద్దరు హీరోయిన్లు…..
శాంతి క్రాంతి సినిమాను కన్నడ హీరో మరియు దర్శకుడైనా వి రవి చంద్రన్ తీశారు. తెలుగు తమిళ, కన్నడ,హిందీ భాషలలో ఈ సినిమాను ప్లాన్ చేసారు. తెలుగులో నాగార్జున, తమిళ, హిందీభాషలలో రజినీకాంత్, కన్నడ లో రవి చంద్రన్ నటించారు. ఇక హీరోయిన్లుగా జూహి చావ్లా, ఖుష్బూ నటించారు. సినిమా ప్రారంభం అయితే బాగా సాగింది, ఆ తర్వాత షూటింగ్‌లో కూడా భారీగానే ఖర్చు పెట్టారు. సొంత నిర్మాణ సంస్థ కాబట్టి ఆ విషయంలో ఎక్కడా తగ్గలేదు రవిచంద్రన్.
సినిమా చాలా వరకు పూర్తయ్యాక బడ్జెట్ సమస్య వచ్చింది రవి చంద్రన్ కి ఇక ఆ సమయంలో తెలుగులో చంటి సినిమా కన్నడ వెర్షన్ రామాచారి సినిమా ద్వారా ఘన విజయం అందుకుని అందులో వచ్చిన డబ్బుతో శాంతి క్రాంతి సినిమాని పూర్తి చేసారు . ఇన్ని ఇబ్బందులు పడి పూర్తి చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. నాలుగు భాషల్లోనూ అదే పరిస్థితి. మరీ ఓవర్ గా తీసిన యాక్షన్ సన్నివేశాలు కొంపముంచాయి,నిర్మాతను నిండా ముంచాయి. ఇక ఈ సినిమాలో కేజీఎఫ్ సినిమాలో కథ చెప్పే అనంతనాగ్ విలన్ గా నటించారు. ఇలా అప్పట్లోనే పాన్ ఇండియా సినిమా వచ్చింది సౌత్ సినిమా పరిశ్రమకు ఇవేం కొత్తకాదు. కాకపోతే అప్పట్లో పాన్ ఇండియా అనే పేరు లేదు అంతే…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…