General News

Crime News: నెల రోజులు కాపుకాసి.. 10 నిమిషాల్లో ఖతం.. హైదరాబాద్ పరువు హత్య నిందితులు అరెస్ట్!

Crime News: హైదరాబాద్ లో బుధవారం సాయంత్రం పరువు హత్య జరిగిన సంగతి మనకు తెలిసిందే. వికారాబాద్‌ జిల్లా మర్పల్లికి చెందిన బిల్లిపురం నాగరాజు (25), ఆశ్రిన్‌ సుల్తానా ప్రేమించుకొని జనవరి నెలలో ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆశ్రిన్‌ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని వీరిద్దరూ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లిపోయారు. అయితే తమ కోసం తమ కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టలేదని తెలుసుకున్న ఈ జంట తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.

Crime News: నెల రోజులు కాపుకాసి.. 10 నిమిషాల్లో ఖతం.. హైదరాబాద్ పరువు హత్య నిందితులు అరెస్ట్!

వీరిద్దరూ హైదరాబాద్ వచ్చారని తెలుసుకున్న ఆశ్రిన్‌ సోదరుడు అతని బావ వీరి కదలికలను అనుసరిస్తూ బుధవారం సాయంత్రం నాగరాజు పై దాడి చేసి చంపిన సంగతి మనకు తెలిసిందే. ఈ విధంగా హైదరాబాదులో జరిగిన ఈ పరువు హత్య ఒక్కసారిగా సంచలనం అయింది. కులాంతర వివాహం చేసుకోవడంతో వీరి పై పగ పెంచుకున్న ఆశ్రిన్‌ సోదరుడు నెలరోజులపాటు వీరి కోసం గాలించి చివరికి బుధవారం సాయంత్రం ద్విచక్ర వాహనంలో బయటకు వెళ్లిన ఇతనిపై ఆశ్రిన్‌ సోదరుడు ఆమె భావ దాడి చేసి దారుణంగా చంపారు.

Crime News: నెల రోజులు కాపుకాసి.. 10 నిమిషాల్లో ఖతం.. హైదరాబాద్ పరువు హత్య నిందితులు అరెస్ట్!

కేవలం పది నిమిషాల్లోనే నాగరాజు పై దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా
ఎల్బీనగర్‌ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి సారథ్యంలో పోలీసులు గాలించి నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ హత్యలో భాగంగా ఆశ్రిన్‌ సోదరుడు ఆమె రెండవ అక్క భర్తతో కలిసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ప్రభుత్వ పరిహారం అందజేస్తుంది…

ఈ సందర్భంగా డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ మాట్లాడుతూ నాగరాజు ఎస్సీ వర్గానికి చెందిన వారు కావడంతో ప్రభుత్వ పరిహారం అతడి కుటుంబానికి చేరుతుందని డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ తెలిపారు. తన కొడుకు మృతి చెందడంతో నాగరాజు కుటుంబసభ్యులు ఆశ్రిన్‌ను తమ వెంట మర్పల్లి తీసుకెళ్లారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago