Babu gogineni again in Vishwak Sen issue : విశ్వక్ సేన్ దేవి నాగవల్లి వివాదం మంటలు ఇంకా చల్లారలేదు. దేవి నాగవల్లికి ఓ వైపు మద్దతు గా కొంత మంది మాట్లాడుతుంటే విశ్వక్ కోసం కొంత మంది మాట్లాడుతున్నారు. అనూహ్యంగా నిన్నటి వరకు సినీ ఇండస్ట్రీ నుండి తక్కువ సపోర్ట్ అందుకున్న విశ్వక్ ఇపుడు మాత్రం ఎక్కువ మంది మద్దతును పొందుతున్నాడు. ఇక విశ్వక్ విషయంలో మొదటి నుండి నెటిజన్స్ బాగా సపోర్ట్ ఇచ్చారు. దేవి నాగవల్లిది మొదట తప్పని ట్రోల్ చేసారు. సామజిక మాధ్యమాల్లో ఓటింగ్ నిర్వహించి మరి తప్పు ఎవరిదంటూ లెక్కలు వేస్తున్నారు. చాలా పోల్స్ లో విశ్వక్ రైట్ అంటూ ఓట్లు పడుతున్నాయి.
ఇక తప్పు రెండు వైపులా ఉన్నా కేవలం విశ్వక్ ని మాత్రమే బలి చేయడం సరికాదని మరి కొంతమంది అభిప్రాయ పడుతున్నారు. ఇక మొదట విశ్వక్ ను వ్యక్తిగతంగా దేవి నాగవల్లి డిప్రెస్డ్ పర్సన్, పాగల్ అనడం తప్పు ఒక జర్నలిస్ట్ అయ్యుండి దేవి ఒక వ్యక్తి పర్సనల్ ఇష్యూని ఒక టీవీ ఛానల్ డిబేట్ లో అనడం అందునా అతని అనుమతి లేకుండా అతను డిప్రెషన్ లో ఉన్నాడు అంటూ మాట్లాడటం సరి కాదని ఇండియన్ మెంటల్ హెల్త్ యాక్ట్ని ఉల్లంఘించనట్లేనని, బాబు గోగినేని చెప్పారు. దేవి అలా మాట్లాడుతుండటంతో విశ్వక్సేన్ ఆమెను వారించారు కూడా,అయిన ఆమె గెట్ అవుట్ అంటూ విశ్వక్ ను అనడం వీటిపై విశ్వక్ పరువు నష్టం దావా వేయొచని చెప్పారు.
అయితే ఇపుడు మరోసారి బాబు గోగినేని ఈ ఇష్యూ పై స్పందించారు. టీవీ 9లో ప్రసారమైన ఒక పాత వీడియో క్లిప్స్ ను చూపుతూ ఈసారి మళ్ళీ తప్పేవరిదో చెప్పే ప్రయత్నం చేసారు. ఫేస్బుక్లో ఆయన తాజాగా కొన్ని ఫొటోలు పోస్ట్ చేస్తూ తన ప్రశ్నల్ని సంధించారు. ఆ ఫొటోలు చూస్తే అచ్చం మొన్న విశ్వక్సేన్ టీమ్ సినిమా గురించి చేసిన ప్రాంక్ వీడియోలాగే ఉంది. వీళ్లు చేసింది తప్పే, వాళ్లు చేసిందీ తప్పే అంటూనే.. విశ్వక్సేన్ చేసిన పనీ తప్పే అని చెప్పారు బాబు గోగినేని. మా అన్నొత్తేనే ఉంటా లేకపోతే నేను ఉండను! అని నీళ్లతో నిండిన పెట్రోల్ క్యాన్ పట్టుకుని రోడ్డు పక్కన కొంతమంది మిత్రులు సూసైడ్ ప్రాంక్ స్కిట్ చేశారు. ఆ స్కిట్ను టీవీ9 సరదాగా ప్రసారం చేసింది. అపుడు తప్పు కానిది విశ్వక్ విషయంలో తప్పేలా అయిందో చెప్పాలన్నారు. అప్పుడు తప్పు అయితే ఆ విధమైన పని చేయడం ఇపుడు తప్పే ఒకటి సరదా ఒకటి తప్పు ఎలా అవుతాయి వారి నిజాయతీని వాల్లే ప్రశ్నించుకోవాలి అంటూ బాబు గోగినేని మరోసారి టీవీ 9ను ఏకి పారేసాడు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…