Actress Madhavi Reddy: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించిన నటి మాధవి రెడ్డి తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా మాధవి రెడ్డి తన సినీ కెరీర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒకప్పుడు తాను ఏమాత్రం తీరిక లేకుండా సినిమా షూటింగ్ లో పాల్గొనేదానిననీ కనీసం సర్జరీ చేయించు కోవడానికి కూడా తనకు వీలు లేకుండా పోయిందని తెలిపారు.
సర్జరీ రేపు ఉదయం జరుగుతుంది అనగా రాత్రి వరకు షూటింగ్ లో పాల్గొన్నానని, సర్జరీ అయిన ఐదు రోజులకి తిరిగి షూటింగ్ లో పాల్గొన్నారని అప్పటి సంగతులను మాధవి రెడ్డి వెల్లడించారు.ఇకపోతే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డిగ్రీ చదివేటప్పుడు తిరుపతి మహిళా యూనివర్సిటీలో రోజా ఇద్దరు ఒకటే క్లాస్ మేట్స్ అని తెలియజేశారు. ఈ క్రమంలోనే అప్పటి సంగతులను మాధవి గుర్తుచేసుకున్నారు.
మేము డిగ్రీ చదువుతున్న రోజుల్లో శివప్రసాద్ గారు రోజాతో ప్రేమ తపస్సు సినిమా చేశారని మాధవి రెడ్డి తెలిపారు. ఆ సమయంలో నువ్వు నల్లగా ఉన్నావు పనిమనిషి పాత్రకు కరెక్టు గా సెట్ అవుతావని రోజాను ఏడిపించేవాళ్ళమని మాధవి రెడ్డి ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.
ఇలా డిగ్రీ తర్వాత రోజా హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాలలో నటించారు.అయితే హీరోయిన్ అయిన తర్వాత తనని మోడ్రన్ మహాలక్ష్మి కార్యక్రమంలో కలుసుకున్నానని ఆ సమయంలో వెళ్లి డిగ్రీలో మీ క్లాస్మేట్ అని పలకరించగా రోజా కూడా గుర్తుపట్టి పలకరించి ప్రస్తుతం ఏం చేస్తున్నారు ఏంటి అని మాట్లాడమని ఈ సందర్భంగా మాధవి రెడ్డి రోజా గురించి వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…