Featured

Actress Sitara: చిన్నతనంలోనే హీరోయిన్ గా రావడంతో చాలా కోల్పోయాను : నటి సితార

Actress Sitara: తెలుగు ప్రేక్షకులకు సీనియర్ నటి,హీరోయిన్ సితార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో అగ్ర హీరోలందరి సరసన నటించిన హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, మలయాళం భాషల్లో కూడా పలు సినిమాల్లో నటించి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది.

Actress Sitara: చిన్నతనంలో నేను అలా రావడంతో చాలా కోల్పోయాను : నటి సితార

నటి సితార మొదట 1990 సంవత్సరంలో వచ్చిన మనసు మమత అనే సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు ఏర్పరచుకున్న సితార అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అంతే కాకుండా తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ ని క్రియేట్ చేసుకుంది. ఇకపోతే ఇటీవలె సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన సితార ప్రస్తుతం సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తోంది.

Actress Sitara: చిన్నతనంలో నేను అలా రావడంతో చాలా కోల్పోయాను : నటి సితార

బుల్లితెరపై ప్రసారమయ్యే పలు సీరియల్స్ లో కూడా నటిస్తోంది. ఈ క్రమంలోనే మాటీవీ లో ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో నటిస్తోంది. ఇకపోతే నటి సితార ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా అలాగే ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక ఆమె ఎక్కడికి వెళ్లిన కూడా ఆమె పెళ్ళికి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి.ఆ సమయంలో ఆమె విసుక్కోకుండా ఓపికగా సమాధానం చెబుతూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సితార తన జీవితంలో జరిగిన ఎన్నో విషయాల గురించి చెప్పుకొచ్చింది.

ఆ లోటు ఉండిపోయింది…

ఈ సందర్భంగా సితార మాట్లాడుతూ.. ఆమె చిన్న వయసులోనే హీరోయిన్ కావడంతో టీనేజి లైఫ్ ను మిస్ అయ్యిందట. స్కూలుకు వెళ్ళినా కూడా ఆమె ఆలోచనలు అన్నీ కూడా సినిమాలతోనే నిండి ఉండేవని, దాంతో సినిమాలతోనే బిజీగా ఉండడంతో టీనేజ్ దశను పూర్తిగా ఆస్వాదించలేక పోయానని చెప్పుకొచ్చింది సితార. ఆ తర్వాత ఆమె తండ్రి అకస్మాత్తుగా మరణించడంతో ఆమెకు వెలితిగా అనిపించడంతో పాటు, ఆమె తండ్రి చెప్పిన చిన్నచిన్న పనులు చేసి ఉంటే బాగుండు అని బాధ పడిందట.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

1 day ago

కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారా? వెన్నెముకకు ముప్పు తెస్తున్న కొత్త జీవనశైలి ఇదే!

ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…

1 day ago

మధుమేహం, గుండె జబ్బులు లేకుండా పిల్లలు పుడతారా? శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది!

వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…

2 days ago

కరివేపాకుతో బరువు తగ్గొచ్చా? రోజూ ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు!

ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…

2 days ago

83 ఏళ్ల వయసులోనూ అదే కసి.. ఒక సీన్ కోసం నిద్ర మానేసిన అమితాబ్ బచ్చన్!

సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…

2 days ago

పీరియడ్స్ సమయంలో యోగా చేయొచ్చా? అపోహలు పక్కన పెట్టండి.. నిపుణులు చెబుతున్న నిజాలు ఇవే!

నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…

2 days ago