Crime News: హైదరాబాద్ లో బుధవారం సాయంత్రం పరువు హత్య జరిగిన సంగతి మనకు తెలిసిందే. వికారాబాద్ జిల్లా మర్పల్లికి చెందిన బిల్లిపురం నాగరాజు (25), ఆశ్రిన్ సుల్తానా ప్రేమించుకొని జనవరి నెలలో ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆశ్రిన్ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని వీరిద్దరూ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లిపోయారు. అయితే తమ కోసం తమ కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టలేదని తెలుసుకున్న ఈ జంట తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.

వీరిద్దరూ హైదరాబాద్ వచ్చారని తెలుసుకున్న ఆశ్రిన్ సోదరుడు అతని బావ వీరి కదలికలను అనుసరిస్తూ బుధవారం సాయంత్రం నాగరాజు పై దాడి చేసి చంపిన సంగతి మనకు తెలిసిందే. ఈ విధంగా హైదరాబాదులో జరిగిన ఈ పరువు హత్య ఒక్కసారిగా సంచలనం అయింది. కులాంతర వివాహం చేసుకోవడంతో వీరి పై పగ పెంచుకున్న ఆశ్రిన్ సోదరుడు నెలరోజులపాటు వీరి కోసం గాలించి చివరికి బుధవారం సాయంత్రం ద్విచక్ర వాహనంలో బయటకు వెళ్లిన ఇతనిపై ఆశ్రిన్ సోదరుడు ఆమె భావ దాడి చేసి దారుణంగా చంపారు.

కేవలం పది నిమిషాల్లోనే నాగరాజు పై దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా
ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి సారథ్యంలో పోలీసులు గాలించి నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ హత్యలో భాగంగా ఆశ్రిన్ సోదరుడు ఆమె రెండవ అక్క భర్తతో కలిసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ప్రభుత్వ పరిహారం అందజేస్తుంది…
ఈ సందర్భంగా డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ మాట్లాడుతూ నాగరాజు ఎస్సీ వర్గానికి చెందిన వారు కావడంతో ప్రభుత్వ పరిహారం అతడి కుటుంబానికి చేరుతుందని డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ తెలిపారు. తన కొడుకు మృతి చెందడంతో నాగరాజు కుటుంబసభ్యులు ఆశ్రిన్‌ను తమ వెంట మర్పల్లి తీసుకెళ్లారు.































