Featured

Comedian Sudhakar : మెగాస్టార్ విలన్ గా ఉన్నప్పుడే సుధాకర్ హీరోగా కొనసాగాడు.. తిరిగి కమెడియన్ గా అవతారమెత్తాడు.. ఇప్పుడు ఆరోగ్యం బాగోలేక..!!

జిలిబిలి పలుకులు,మిలమిల మెరుపులు,నగవుల వలపులు,వెలుగుల తారలు.. అనే ఓ మహాకవి చెప్పిన పాటలోని సాహిత్యం సినిమా తారలకు చక్కగా సరిపోతుంది.శుక్రవారం సినిమా విడుదల ఒక తార భవిష్యత్ ఆకాశాన్నంటుతే.. మరో శుక్రవారం సినిమా విడుదల ఇంకో తార సినీ భవిష్యత్ అదో పాతాళానికి వెళ్ళనువచ్చు… అలా 1976.. ప్రాంతంలో ఓకే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో శిక్షణ పొందిన మెగాస్టార్ చిరంజీవి, సుధాకర్.. అనతికాలంలోనే సినీ పరిశ్రమలో ఉన్నత శిఖరాలకి ఎదిగారు. అయితే సుధాకర్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో శిక్షణ తీసుకుంటున్న కాలంలోనే తమిళ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి….

సుధాకర్ చలనచిత్ర నటుడు, నిర్మాత. ఇతడు నటుడిగాను, హాస్య నటుడి గాను కొన్ని తెలుగు, తమిళ చిత్రాలలో నటించాడు. సుధాకర్ స్వస్థలం ప్రకాశంజిల్లాలోని మార్కాపురం, తండ్రి గంగమాల రత్నం డిప్యూటీ కలెక్టర్. తల్లి కటాక్షమ్మ. ఏడుగురు మగ సంతానమున్న ఈ కుటుంబంలో సుధాకర్ చివరివాడు. తండ్రి ఉద్యోగ విధుల వలన రాష్ట్రమంతటా పనిచేశాడు. సుధాకర్ కర్నూలు జిల్లా కోయిలకుంట్లలో పుట్టాడు. బాల్యం కోయిలకుంట్ల, కోడుమూరు, ఆదోని, కర్నూలు, బోధన్ నుండి కాకినాడ వరకు వివిధ ఉళ్లలో గడిచింది.ఏలూరులో, గుంటూరులోవిద్యాభ్యాసం పూర్తి చేసాడు.

ఆయన సినిమా అవకాశాల రీత్యా నటులు చిరంజీవి, హరిప్రసాద్, నారాయణరావులతో కలసి మద్రాస్ లో ఒకే గదిలో ఉన్నారు. ఆయన ఒకసారి అప్పటికి సహాయ దర్శకుడిగా ఉన్న దర్శకుడు భారతీరాజాను కలవడం ఆయన సుధాకరును “కిళుక్కెమ్ పోంగెమ్ రెయిల్ సినిమాకి సిఫారసు చేయడం అది విజయవంతం అవడం జరిగింది. అప్పటికి చిరంజీవి రాణికాసులరంగమ్మ, మోసగాడు, బందిపోటుసింహం లాంటి చిత్రాలలో విలన్ తరహా వేషాలు వేస్తున్నారు. దాదాపు నలభై అయిదు తమిళ చిత్రాలలో సుధాకర్ నటించాడు. నటి రాధికతో పద్దెనిమిది సినిమాలలో నటించాడు. తమిళ సినిమాలలో విజయవంతమైన పలు చిత్రాలలో నటించి,పెద్ద నటుడిగా పేరు తెచ్చుకున్నా, తమిళ సినీ పరిశ్రమలోని రాజకీయాల వల్ల అక్కడినుండి తెలుగు పరిశ్రమకు వచ్చి సహాయ నటుడిగా, హాస్యనటుడిగా.. మొదట్లో సికింద్రాబాద్ లోని పద్మారావునగర్ లో స్థిరపడాల్సి వచ్చింది.

తెలుగులో ఇతడి మొదటి చిత్రము సృష్టి రహస్యాలు. అయితే అతనికి పేరు తెచ్చిన చిత్రాలు ఊరికిచ్చిన మాట, భోగి మంటలు,పెద్దరికం, యముడికి మొగుడు, హిట్లర్, ముగ్గురు మొనగాళ్లు, సుస్వాగతం, శుభాకాంక్షలు. ఆయన 2010 జూన్ 29న అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరిన సుధాకర్ జూలై 4-2010 నుండి కోమాలో వెళ్లినట్లు హైదరాబాద్‌లో బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కానీ కొంతకాలానికి వైద్యసహాయం అందిపబడి కోలుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్, జూబ్లీహిల్స్ లోనే ఉంటూ పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. తన కొడుకు బెన్ని మైఖేల్ ను సినిమాలలో హీరోగా పరిచయం చేయాలని సుధాకర్ చూస్తున్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago