Increasing support to Vishwak Sen : విశ్వక్ సేన్, దేవి నాగవల్లి ఈ ఇష్యూ ఇపుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ప్రాంక్ తో మొదలైన ఈ వివాదం చివరికి టీవీ డిబేట్ తో మరో మలుపు తిరిగి వ్యక్తిగత దూషణలతో రచ్చ అయింది. ఇక ఈ వివాదంలో ఇద్దరి తప్పు ఉన్నా కూడా దేవికి మద్దతుగా జర్నలిస్టులు, మహిళా సంఘాలు నిలవడంతో విశ్వక్ కు సిని పరిశ్రమనుండి ఆశించినంత మద్దతు లభించక పోవడంతో నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేసారు నిజానికి ఈ వివాదంలో ముందు నుండి విశ్వక్ కు నెటిజన్స్ మద్దతుగా నిలబడ్డారు. టీవీ 9ను యాంకర్. దేవి నాగవల్లిని బాగా ట్రోల్ చేస్తున్నారు.
ఇక సినిమా పరిశ్రమ నుండి కొంత మంది విశ్వక్ కు మద్దతు తెలిపారు. ఇక విశ్వక్ ఈ విషయంలో క్షమాపణలు చెప్పిన ఇష్యూ ముగియలేదు. అదికాక మొదట దేవి నాగవల్లి విశ్వక్ గురించి వ్యక్తిగతంగా మాట్లాడకుండా ఉండుంటే ఇలా జరిగేది కాదని చాలా మంది అభిప్రాయపడ్డారు. రాహుల్ రామకృష్ణ, సీనియర్ హీరోయిన్ కస్తూరి , బాబు గోగినేని, కరాటే కళ్యాణి వంటి వారు విశ్వక్ కు మద్దతుగా నిలిచారు. ఇక ఇపుడు మరో యువ దర్శకుడు విశ్వక్ కోసం మాట్లాడాడు.
నేనైతే నీలా మాట్లాడను నాలుగు తగిలిస్తా….
ఇక టాలీవుడ్ యువ దర్శకుడు బండి సరోజ్ కుమార్ హాట్ కామెంట్లు చేశాడు. ‘విశ్వక్ సేన్ మంచోడు కాబట్టి ఒక్క బూతు మాటతో వదిలేశాడు. అదే నేనైతే ఆమెకు నాలుగు తగిలించేవాడిని. మహిళ అని ఒక వైపు మాట్లాడొద్దు. నా దృష్టిలో జెండర్ కార్డ్ అనేది జాతి, కులం, మతం కార్డులకు ఏమాత్రం అతీతం కాదు. మొదట మనిషిలా ప్రవర్తించడం నేర్చుకోవాలి అని డైరెక్ట్ కౌంటర్ ఇచ్చాడు. కాగా, బండి సరోజ్ కుమార్ నిర్బంధ్, నిర్బంధ్ 2 చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక పలు సామాజిక మాధ్యమాల్లో కూడా విశ్వక్, దేవి లలో ఎవరు కరెక్ట్ అని పోల్ నిర్వహిస్తే చాలా వరకు నెటిజన్స్ విశ్వక్ కి సపోర్ట్ చేస్తుండడం గమనార్హం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…