General News

భద్రాచలంలో అమానుషం.. 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం!

భద్రాచలం: తెలంగాణలోని భద్రాచలం జిల్లాలో మరోసారి ఒక అమానుష ఘటన చోటు చేసుకుంది. 17 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Gang rape of a 17-year-old girl in Bhadrachalam

పోలీసుల కథనం ప్రకారం, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఒక గిరిజన బాలిక తన బంధువుల ఇంటికి వెళ్లేందుకు శనివారం సాయంత్రం చర్ల మండల కేంద్రానికి వచ్చింది. అక్కడినుంచి వాజేడు ప్రాంతానికి వెళ్లేందుకు ఆమె ఒక ఆటో ఎక్కింది. అదే సమయంలో ఆటోలో ఉన్న కొందరు దుండగులు బాలికకు కూల్‌డ్రింగ్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేశారు. అనంతరం ఆమెపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ ఘటన తర్వాత బాలికను స్థానికులు గుర్తించి ఒక సంరక్షణ కేంద్రానికి తరలించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలికను పరిశీలించగా, ఆమె శరీరంపై పంటి గాట్లు, గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఆధారాలతో పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చర్ల, దుమ్ముగూడెం, పాల్వంచ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిందితుల కోసం విస్తృతంగా గాలిస్తున్నామని, త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

ఈ దారుణంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నరమ్రుగాలకు కఠిన శిక్షలు పడాలని, బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆపమని వారు హెచ్చరించారు. ఈ ఘటన సమాజంలో భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago