Political News

“ఆడుదాం ఆంధ్రా”పై విచారణ పూర్తయింది: మంత్రి రాంప్రసాద్ రెడ్డి

తిరుపతిలో ఏర్పాటు చేసిన అమరావతి ఛాంపియన్‌షిప్ పోటీలను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంపై విచారణ పూర్తయింది. త్వరలోనే బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటాం” అని స్పష్టం చేశారు.

టీడీపీ దేశంలోనే క్రమశిక్షణ కలిగిన పార్టీ అని మంత్రి తెలిపారు. ఎవరు తప్పు చేసినా వారిపై పారదర్శకంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. “పార్టీ అధిష్ఠానానికి అందరూ సమానమే, ఎవరూ ఎక్కువ, ఎవరూ తక్కువ కారు” అని రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు.

గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో అవినీతి జరిగిందనే ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో, కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. క్రీడా పరికరాల కొనుగోళ్లు, క్రీడాకారులకు వసతి కల్పించేందుకు కేటాయించిన నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి.

ఈ ఆరోపణలపై విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేసి నివేదిక సిద్ధం చేశారు. దానిపై ఆధారంగా త్వరలోనే బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago