Gangavva: గంగవ్వ ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు గంగవ్వ అందరికీ సుపరిచితమే.గంగవ్వకు ఏమాత్రం లోకజ్ఞానం తెలియకపోయినా చదువు గురించి ఏ మాత్రం పట్టు లేకపోయిన కేవలం తనలో ఉన్న టాలెంట్ బయట పెట్టడంతో కొంతమంది కుర్రాళ్ళు ఆమె టాలెంట్ గుర్తించి మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి గంగవ్వ వీడియోలను షేర్ చేసేవారు.
ఈ విధంగా యూట్యూబ్ లో గంగవ్వ వీడియోలు ఓ రేంజ్ లో అందరిని ఆకట్టుకున్నాయి. ఇలా రోజురోజుకు గంగవ్వ తనలో ఉన్న టాలెంట్ బయట పెడుతూ రోజు రోజుకు విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇదే పాపులారిటీతో ఈమెకు ఏకంగా బిగ్ బాస్ సీజన్ 4 అవకాశం కూడా వచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసిన గంగవ్వ అనారోగ్యం కారణంగా మధ్యలోనే బయటకు వచ్చింది.
గంగవ్వ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే సమయానికి తన దగ్గర కనీసం ఉండటానికి కూడా ఇల్లు లేకపోవడంతో తనకు ఇల్లు కట్టిస్తానని నాగార్జున మాటిచ్చారు.ఆయన మాట ప్రకారం గంగవ్వ కొత్త ఇల్లు కట్టడమే కాకుండా గత ఏడాది గృహప్రవేశం కూడా చేశారు. ఇక గంగవ్వ గృహ ప్రవేశ కార్యక్రమంలో భాగంగా కొందరు సెలబ్రిటీలు సందడి చేశారు. ఇదిలా ఉండగా ఈమెకు వచ్చిన పాపులారిటీతో ఏకంగా ఈమె వరస సినిమా అవకాశాలను అందుకుని బిజీగా ఉన్నారు.
ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా గంగవ్వ కోసం నిర్మాతలు ఏకంగా ప్రత్యేకంగా కేరవాన్ ఏర్పాటు చేశారని తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలకు మాత్రమే కేరవాన్ ఏర్పాటు చేస్తారు. ఓ మోస్తారు నటీనటులకు ఇలాంటి క్యారవాన్ సదుపాయం ఉండదు. అయితే గంగవ్వ కోసమే ప్రత్యేకంగా క్యారవాన్ ఏర్పాటు చేశారంటేనే గంగవ్వ రేంజ్ ఏంటో ఎంతో అర్థమవుతుంది. ఈ క్రమంలోనే గంగవ్వ కేరవాన్ కి సంబంధించిన ఒక వీడియోని ఆ అనుభూతులను వీడియో రూపంలో వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…