Samantha – Naga Chaitanya: అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. మళ్ళీ కలవబోతున్న సమంత నాగ చైతన్య!

Samantha – Naga Chaitanya: టాలీవుడ్ లో అగ్రహీరోయిన్ గా అక్కినేని ఇంటికి కోడలిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత గతేడాది నాగచైతన్యతో విడాకులు తీసుకొని విడిపోయిన విషయం మనకు తెలిసిందే. ఇలా వీరిద్దరూ విడాకుల ప్రకటన చేసిన తర్వాత ఎంతో మంది అభిమానులు వీరిద్దరూ కలిస్తే బాగుంటుందని భావించారు.

Samantha – Naga Chaitanya: అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. ఒక్కటి కాబోతున్న సమంత నాగ చైతన్య!

అయితే సమంత నాగచైతన్య వీరి విడాకుల గురించి ప్రస్తావించకుండా ఎవరి కెరియర్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. తాజాగా సమంత నాగ చైతన్యల గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.విడాకుల తో విడిపోయిన సమంత నాగచైతన్య తిరిగి ఒకటి కాబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే వీరిద్దరూ ఒకటి కాబోతున్నది రియల్ లైఫ్ లో కాదు…రీల్ లైఫ్ లో అనే వార్త ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Samantha – Naga Chaitanya: అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. ఒక్కటి కాబోతున్న సమంత నాగ చైతన్య!

సమంత నాగచైతన్య విడాకులు ప్రకటనకు ముందు సమంత స్నేహితురాలు నందినిరెడ్డి సమంత నాగ చైతన్య కోసం ఒక అద్భుతమైన కథను సిద్ధం చేశారు.ఇక ఈ సినిమా కథను సమంత నాగచైతన్య వినిపించగా వీరిద్దరూ కలిసి ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక వీరు పలు మనస్పర్థల కారణంగా విడాకుల ప్రకటించడంతో ఈ ప్రాజెక్ట్ గురించి పక్కన పెట్టారు.

అభిమానులకు పండుగ…

ఇక నందినీరెడ్డి దర్శకత్వంలో నాగచైతన్య ఈ సినిమా చేయడానికి చాలా ఆసక్తిగా ఉన్నారు.అయితే నందినిరెడ్డి సమంతను ఈ ప్రాజెక్టు కోసం ఒప్పించే ప్రయత్నాలలో ఉన్నారని తెలుస్తోంది. ఇదే గనుక నిజమైతే ఇటు నాగచైతన్య అభిమానులకు సమంత అభిమానులకు పండగ అని చెప్పవచ్చు.