Sithara Gattamaneni : సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక ఫ్యామిలీ మ్యాన్ సినిమాలతో ఎంత బిజీగా ఉంటారో తన ఫ్యామిలీతో గడపడానికి అంతే సమయం కేటాయిస్తారు. సినిమా షూటింగ్ తర్వాత కొన్నిరోజులు విరామం దొరికినా ఫ్యామిలీతో పాటు విదేశాలకు చెక్కేస్తారు. తన కటుంబం గడపడానికే ఎక్కువ ఇష్టపడే మహేష్ ఎపుడైనా టెలివిజన్ కార్యక్రమాల్లో సందర్బం వస్తే తన కొడుకు గౌతమ్, ముద్దులా గారాలపట్టి సితార గురించి చెప్తుంటారు.
ఇక సితార సామాజిక మధ్యమాల్లో చురుకుగా ఉంటుంది. తన స్నేహితురాలితో కలిసి ఒక యూట్యూబ్ ఛానెల్ ను కూడా నడిపింది. ఇక ఇపుడు మహేష్ బాబు కొత్త సినిమా సర్కారు వారి పాట సినిమాలో ఒక పాటకు డాన్సు చేసి అందరిని ఆశ్చర్య పరిచింది.ఇక అంతకు ముందు సర్కారు వారి పాట సినిమా నుండి విడుదలైన కళావతి పాటకు స్టెప్పులేసి అదరగొట్టింది. అచ్చం మహేష్ లాగే డాన్సు చేసి మెస్మరైజ్ చేసింది.
నాన్నకు కోపమే రాదు….
ఈ మధ్యనే సర్కారు వారి పాట సినిమానుండి విడుదలైన పెన్నీ సాంగ్ లో సితార డాన్సు అదరగొట్టింది. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సితార తన తండ్రి గురించి కుటుంబం గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది.యూట్యూబ్, ఇంస్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉండటం తనకు ఇష్టమని వీడియోలు చేయడం చాలా. ఆనందంగా ఉంటుందని సితార చెప్పింది
ఇక తన అన్న గురించి చాడీలు చెప్పాలంటే అమ్మ నమ్రత దగ్గరికే వెళ్తానంటూ చెప్పుకొచ్చింది. మొదటిసారి కెమెరా ముందు డాన్సర్స్ తో పాటు డాన్సు చేయడం మంచి అనుభూతిని ఇచ్చిందని తెలిపింది పెన్నీ సాంగ్ కూ డాన్సు చేసినపుడు అందంగా స్క్రీన్ మీద కనిపిస్తానో లేదో అని భయపడ్డానంటూ ముద్దు ముద్దుగా చెప్పేసింది.
బీటిల్స్ సాంగ్స్ సితారకు ఇష్టమట అంతే కాకుండా మహేష్ బాబు చాలా హ్యాపీ గా ఉంటారని అసలు నాన్నకు కోపమే రాదని చెప్పింది. ఇక తాను డాన్సు అనీ మాస్టర్, అరుణ భిక్షు దగ్గర నేర్చుకుంటున్నట్టు తెలిపారు. తన వీడియోలను అమ్మ షూట్ చేస్తుందని, ఫోటో షూట్స్ కు ఒక స్టైలిష్ట్ ఉన్నాడని అతనే దుస్తులను ఎంపిక చేస్తాడని సితార వెల్లడించారు. ఇంట్లో ఎక్కువగా అల్లరి పనులు చేసేది తానేనని చెప్పుకొచ్చింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…