Samantha – Naga Chaitanya: టాలీవుడ్ లో అగ్రహీరోయిన్ గా అక్కినేని ఇంటికి కోడలిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత గతేడాది నాగచైతన్యతో విడాకులు తీసుకొని విడిపోయిన విషయం మనకు తెలిసిందే. ఇలా వీరిద్దరూ విడాకుల ప్రకటన చేసిన తర్వాత ఎంతో మంది అభిమానులు వీరిద్దరూ కలిస్తే బాగుంటుందని భావించారు.
అయితే సమంత నాగచైతన్య వీరి విడాకుల గురించి ప్రస్తావించకుండా ఎవరి కెరియర్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. తాజాగా సమంత నాగ చైతన్యల గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.విడాకుల తో విడిపోయిన సమంత నాగచైతన్య తిరిగి ఒకటి కాబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే వీరిద్దరూ ఒకటి కాబోతున్నది రియల్ లైఫ్ లో కాదు…రీల్ లైఫ్ లో అనే వార్త ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
సమంత నాగచైతన్య విడాకులు ప్రకటనకు ముందు సమంత స్నేహితురాలు నందినిరెడ్డి సమంత నాగ చైతన్య కోసం ఒక అద్భుతమైన కథను సిద్ధం చేశారు.ఇక ఈ సినిమా కథను సమంత నాగచైతన్య వినిపించగా వీరిద్దరూ కలిసి ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక వీరు పలు మనస్పర్థల కారణంగా విడాకుల ప్రకటించడంతో ఈ ప్రాజెక్ట్ గురించి పక్కన పెట్టారు.
ఇక నందినీరెడ్డి దర్శకత్వంలో నాగచైతన్య ఈ సినిమా చేయడానికి చాలా ఆసక్తిగా ఉన్నారు.అయితే నందినిరెడ్డి సమంతను ఈ ప్రాజెక్టు కోసం ఒప్పించే ప్రయత్నాలలో ఉన్నారని తెలుస్తోంది. ఇదే గనుక నిజమైతే ఇటు నాగచైతన్య అభిమానులకు సమంత అభిమానులకు పండగ అని చెప్పవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…